AP news: ఈ- క్రాప్ నమోదుకు సచివాలయ సిబ్బంది చేతివాటం

ABN , First Publish Date - 2022-10-04T16:31:25+05:30 IST

ఈ- క్రాప్ నమోదుకు సచివాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించింది.నార్పల మండల కేంద్రంలో సచివాలయం 1లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

AP news: ఈ- క్రాప్ నమోదుకు సచివాలయ సిబ్బంది చేతివాటం

అనంతపురం: ఈ- క్రాప్ నమోదుకు సచివాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించింది. నార్పల మండల కేంద్రంలో సచివాలయం 1లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  నార్పల మండల కేంద్రంలో సచివాలయం 1లో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ కీర్తి ఈ-క్రాప్ నమోదు కోసం రైతుల నుండి డబ్బులు వసూలు చేశారు. ఒక్కో రైతు నుంచి రూ.1000 నుండి రూ.1500 రూపాయల వరకు సచివాలయ ఉద్యోగిని వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ‘‘మన దగ్గర 500 రూపాయలు చెల్లుబాటు కావు 1500 రూపాయలు మాత్రమే. డబ్బు ఇస్తే ఏ పంట కావాలంటే ఆ పంటపై ఈ క్రాప్ నమోదు చేస్తా’’ అంటూ సచివాలయ ఉద్యోగిని మాట్లాడిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 


Updated Date - 2022-10-04T16:31:25+05:30 IST