తాడిపత్రిలో ట్రాన్స్ ఫార్మర్‎ను ఢీకొట్టిన కారు

ABN , First Publish Date - 2021-02-28T17:18:59+05:30 IST

జిల్లాలోని తాడిపత్రిలో కారు బీభత్సం సృష్టించింది. తాడిపత్రిలోని శివాలయం దగ్గర ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‎ను కారు ఢీకొట్టింది. మద్యం మత్తులో ఉన్న...

తాడిపత్రిలో ట్రాన్స్ ఫార్మర్‎ను ఢీకొట్టిన కారు

అనంతపురం: జిల్లాలోని తాడిపత్రిలో కారు బీభత్సం సృష్టించింది. తాడిపత్రిలోని శివాలయం దగ్గర ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‎ను కారు ఢీకొట్టింది. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ అతి వేగంగా తీసుకువచ్చిన కారును విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‎ను ఢీకొట్టాడు. దీంతో పెద్ద పెద్ద శబ్ధాలతో రెండు ట్రాన్స్ ఫార్మర్లు పగిలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అక్కడున్న స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కారు డ్రైవర్‎ను అదుపులోకి తీసుకుని స్టేషన్‎కు తరలించారు.

Updated Date - 2021-02-28T17:18:59+05:30 IST