అనంతపురం: రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ గోపాల్ రెడ్డి ఇంట్లో కురుబ పార్వతి అనే మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. గత కొంత కాలంగా గోపాల్ రెడ్డి ఇంట్లో బ్రహ్మసముద్రం మండలం వేపులపర్తి గ్రామానికి చెందిన భార్యాభర్తలు హనుమంతరాయుడు, కురుబ పార్వతి పనిచేస్తున్నారు. వ్యక్తిగత పని నిమిత్తం హనుమంత రాయుడు స్వగ్రామానికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి పార్వతి అనుమానాస్పదస్థితిలో మృతి చెంది కనిపించింది. వ్యక్తిగత సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి