అనంతపురం జిల్లా: జాతీయ రహదారిపై సైకో వీరంగం

ABN , First Publish Date - 2022-03-15T18:04:21+05:30 IST

అనంతపురం జిల్లా: పెనుకొండ జాతీయ రహదారిపై ఓ సైకో వీరంగం వేశాడు.

అనంతపురం జిల్లా: జాతీయ రహదారిపై సైకో వీరంగం

అనంతపురం జిల్లా: పెనుకొండ జాతీయ రహదారిపై ఓ సైకో వీరంగం వేశాడు. కత్తితో వాహనదారులు, స్థానికులను బెదిరిస్తూ హల్ చల్ చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించినవారిపై రాళ్ల దాడికి దిగాడు. సైకో వీరంగంతో స్థానికులు, వాహనదారులు హడలెత్తిపోయారు. సోమవారం రాత్రి హరియాణాకు చెందిన వ్యక్తి పెనుకొండ హైవేపై హల్ చల్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సైకోను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. వారిని ఇబ్బందిపెట్టాడు. దీంతో హైవే సిబ్బందితో కలిసి సైకోను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2022-03-15T18:04:21+05:30 IST