మందుబాబులకు అడ్డాగా అనంతగిరి

Jul 25 2021 @ 23:58PM
వికారాబాద్‌ : చెత్త కుండీలో మద్యం సీసాలు

వికారాబాద్‌: పర్యాటకకేంద్రంగా అభివృద్ధి చెందుతున్న అనంతగిరి మందుబాబులకు అడ్డాగా మారుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో మందుబాబులు అడవిలోకి చేరి తప్ప తాగుతూ గడుపుతున్నారు. నందీఘాట్‌ వద్ద అటవీశాఖ అధికారులు పార్కింగ్‌ వసూళ్ల మీద పెట్టిన శ్రద్ధ సౌకర్యాలు కల్పించడంలో చూపడంలో, అడవిలో మందుబాబులను నియంత్రించడంలో చూపడంలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి అనంతగిరిలో ఆనందంగా గడిపేందుకు వచ్చే వారికి కొందరు మందుబాబుల వల్ల ఇబ్బందులు సైతం పడుతున్నట్లు తెలుస్తోంది. అనంతగిరికి వెళ్లే మార్గంలో రాజీవ్‌నగర్‌ వద్ద చెక్‌పోస్టు ఉన్నప్పటికీ అక్కడ సరైన పర్యవేక్షణ లేక మందు బాబులు అడవిని అడ్డాలుగా చేసుకుంటున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు అడవిలో మద్య నిషేధం కోసం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Follow Us on: