Ananya Panday: బాయ్‌కాట్ ట్రెండ్‌పై స్పందించిన ‘లైగర్’ హీరోయిన్

Published: Wed, 10 Aug 2022 15:10:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Ananya Panday: బాయ్‌కాట్ ట్రెండ్‌పై స్పందించిన లైగర్ హీరోయిన్

చిన్న తనంలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ అనన్య పాండే (Ananya Panday). ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్-2’, ‘పతి, పత్నీ ఔర్ వో’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా ‘లైగర్’ (Liger) లో నటించింది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా అనన్య పాండే మీడియాకు ఇంటర్వ్యూ  ఇచ్చింది. ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకుంది.


‘లాల్ సింగ్ చడ్డా’ ను బాయ్‌కాట్ చేయాలని కొంతమంది నెట్టింట పోస్ట్‌లు పెడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటని అడగగా ఆమె స్పందించింది. ‘‘ప్రతి రోజు ఎవరినో బాయ్‌కాట్, క్యాన్సిల్  చేస్తున్నారు. ఈ ట్రెండ్ చక్రంలా నడుస్తుందనుకుంటున్నాను. మనం ట్రాక్ తప్పిపోతున్నాం. నేను కూడా అప్పుడప్పుడు నన్ను ఎవరైనా బాయ్‌కాట్ చేశారా అని అడుగుతుంటాను. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటుంటాను. అప్పుడే ఈ ఇబ్బందులను ఏ విధంగా ఎదుర్కోవాలో మనకు తెలుస్తుంది. ఏ విషయాలను సీరియస్‌గా తీసుకోవాలో అర్థమవుతుంది’’ అని అనన్య పాండే చెప్పింది. సౌత్ వర్సెస్ నార్త్ డిబేట్‌పై కూడా ఆమె మాట్లాడింది.  ‘‘నిజం చెప్పాలంటే సౌత్, నార్త్ మధ్య నాకు ఏవిధమైన తేడా కనిపించలేదు. ప్రతి సినిమా, దర్శకుడు విభిన్నంగా ఆలోచిస్తారు. ఇది సాధారణమైన తేడానే అని నాకు అనిపించింది. సౌత్, నార్త్ అనేది కాకుండా మనం భారతీయ సినిమాను రూపొందిస్తున్నాం’’ అని అనన్య పేర్కొంది. ‘లైగర్’ మిక్స్‌డ్ మార్షల్ మార్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది. పాన్ ఇండియాగా రూపొందింది. ఈ చిత్రంలో రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, మార్కండ్  దేశ్ పాండేతో పాటు మైక్ టైసన్ కీలక పాత్రలు పోషించారు.   

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...