Plum BodyLovin: అనన్య పాండేను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించిన ప్లమ్‌ బాడీలవిన్‌

ABN , First Publish Date - 2022-08-07T03:07:11+05:30 IST

బాలీవుడ్ ప్రముఖ నటి అనన్య పాండే (Ananya Pandey)ను ప్లమ్‌ బాడీ లవిన్-ప్లమ్ తమ బాత్ అండ్ బాడీ బ్రాండ్ అంబాసిడర్‌గా

Plum BodyLovin: అనన్య పాండేను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించిన ప్లమ్‌ బాడీలవిన్‌

ముంబై:  బాలీవుడ్ ప్రముఖ నటి అనన్య పాండే (Ananya Pandey)ను ప్లమ్‌ బాడీ లవిన్-ప్లమ్ తమ బాత్ అండ్ బాడీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ‘ఫేస్‌ ఆఫ్‌ ది బ్రాండ్‌’ గా  ఫ్రాగ్రాన్స్‌ విభాగంలోని బాడీ మిస్ట్స్‌, ఫర్‌ఫ్యూమ్స్‌, డియోడరెంట్స్‌లను పలు మాధ్యమాల ద్వారా అనన్య పాండే ప్రచారం చేయనున్నారు. బాత్‌ అండ్‌ బాడీ ‘బ్రాండ్‌ ఆఫ్‌ చాయ్స్‌’ గా యువ భారతం కోసం నిలవాలన్నది ప్లమ్‌ బాడీ లవిన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బ్రాండ్‌లో అత్యంత వినోదాత్మకమైన, ఆహ్లాదకరమైన సిగ్నేచర్‌ ఫ్రాగ్నాన్స్‌ అయిన హవాయియన్‌ రంబి, వనీలా వైబ్స్‌, ట్రిప్పిన్‌ మిమోసాస్‌, ఆర్కిడ్‌ యు నాట్‌ ఉన్నాయి.  


అనన్యపాండేను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడంపై ప్లమ్ సీఈవో, కో ఫౌండర్ శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. యూత్ ఐకాన్‌లలో ఒకరైన అనన్య పాండే భవిష్యత్ తారగా వెలుగొందుతున్నారని, ఆమెతో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ బ్రాండ్‌ను ప్రిఫర్డ్‌ చాయ్స్‌ చేయడంలో ముందడగు వేయడానికి అనన్యతో ఒప్పందం అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. నటి అనన్య పాండే మాట్లాడుతూ.. ప్లమ్‌ బాడీ లవిన్‌కు చెందిన వినూత్నమైన బాడీ మిస్ట్స్‌, పెర్‌ఫ్యూమ్స్‌, రంగు రంగుల డిజైన్లు, ఆహ్లాదకరమైన పేర్లు కలిగిన హవాయియన్‌ రుంబ,  ఆర్చిడ్‌ యు నాట్‌ వంటివి ఆనందాన్ని కలిగిస్తాయన్నారు.  జంతువుల పట్ల తాను చూపించే ప్రేమలానే ఈ బ్రాండ్ కూడా వందశాతం వేగన్ అని, క్రూయల్టీ ఫ్రీ కావడం తనకు ఎంతో నచ్చిందని అన్నారు. 


వివిధ రకాల ప్రాగ్నాన్స్‌.. బ్లీచీ, ఫ్లోరల్‌, ఫ్రూటీమస్కీ.. తదితర ఏడు గొప్ప ఫ్రాగ్నాన్స్‌లతో కూడిన 25కు పైగా ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి. ప్లమ్‌ బాడీలవిన్‌ ఇప్పటికే తమ ఆన్‌లైన్‌ కార్యకలాపాలు విస్తరించడంతో పాటు దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్‌ కార్యకలాపాలు, కియోస్క్‌లు, ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్‌ ఔట్‌లెట్లుతో విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ బ్రాండ్‌కు 1100కు పైగా అసిస్టెడ్‌, 10,000కు పైగా  అన్‌అసిస్టెడ్‌ ఔట్‌లెట్లు ఉన్నాయి.

Updated Date - 2022-08-07T03:07:11+05:30 IST