అనపర్తి నగర పంచాయితీ !

ABN , First Publish Date - 2022-08-13T06:44:39+05:30 IST

జిల్లాలోనే మేజర్‌ పంచా యతీల్లో ఒకటైన అనపర్తికి నగర పంచాయతీ హోదా కలగానే మిగిలింది.

అనపర్తి నగర పంచాయితీ !

ఇప్పటికే నాలుగు సార్లు ఉత్తర్వులు  

అయినా ముందుకు పడని అడుగు


అనపర్తి, ఆగస్టు 12 : జిల్లాలోనే మేజర్‌ పంచా యతీల్లో ఒకటైన అనపర్తికి నగర పంచాయతీ హోదా కలగానే మిగిలింది. హోదాకు అవసరమైన అన్ని హం గులు ఉన్నా ఇప్పటికీ నగర హోదాను అందుకోలేక పోయింది. గత పదేళ్లలో నాలుగు సార్లు పంచాయతీని నగర పంచాయతీగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉత్తర్వుల జారీ చేసినప్పటికీ అనివార్య కారణాలతో తిరిగి పంచాయతీగా మార్పు చెందుతూ వస్తుంది. 2008లోనే మేజర్‌ పంచా యతీగా ఉన్న అనపర్తికి నగర పంచాయతీకి అవసర మైన అన్ని హంగులు ఉండడం, సుమారుగా 27 వేల జనాభా, రూ.2 కోట్ల మేర ఆదాయం ఉండడంతో అప్ప టి పాలకులు అనపర్తిని నగర పంచాయతీగా చేయా లని  భావించారు. 2008లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండగా అప్పటి ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి చొరవతో పంచాయతీ సర్పంచ్‌గా ఉన్న షేక్‌ జయానభి పాలక వర్గం అనపర్తిని నగర పంచాయతీగా మార్పు చేయా లని కోరుతూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించారు.  ఎమ్మెల్యేగా ఉన్న తేతలి అనపర్తిని నగర పంచాయతీగా మార్పు చేయిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయించారు. గ్రామానికి చెందిన కొందరు పెద్దలు కోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం జారీ చేసిన నగర పంచాయతీ జీవోపై కోర్టు స్టే విధించింది. దీంతో 2009లో అనపర్తికి పంచాయతీగా ఎన్నికలు నిర్వహిం చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అనపర్తి పంచాయతీ ఎన్నికల్లో మాత్రం టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. కొద్ది రోజులు తరువాత  అనపర్తికి నగర పంచాయతీగా మార్పు చేస్తూ ప్రభు త్వం మరో జీవో విడుదల చేయడంతో పాలకవర్గం తమకు పదవీకాలం ఉందని కోర్టును ఆశ్రయించడంతో తిరిగి పంచాయతీగా మార్పు చెందింది. తరువాత క్రమంలో వారి పదవీకాలం ముగియడంతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు  చేస్తున్న సమయంలో పాత పాలకవర్గం కోర్టులో ఉన్న స్టేను తొలగించడంతో పంచాయతీ తిరిగి నగర పంచా యతీగా మార్పు చెంది ఎన్నికల ప్రక్రియ నిలిచిపో యింది. తరువాత క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు అన పర్తిని పంచాయతీగా మార్పు చేశారు. పంచా యతీగా ఉన్న అనపర్తి అధికారుల పాలనలో సాగుతూ వచ్చింది. గతేడాది జరిగిన పంచాయతీ ఎన్నికలతో అనపర్తికి నూతన పాలకవర్గం ఏర్పడి పంచాయతీగా కొనసాగు తుంది.అయితే నియోజకవర్గ కేంద్రంగా ఉన్న అనపర్తి ప్రస్తుతం రూ.3కోట్ల పైబడి ఆదాయం ఉన్న మేజర్‌ పం చాయతీగా ఉంది. రైల్వే స్టేషన్‌తో పాటు   అనేక సౌక ర్యాలు ఉన్నాయి. గ్రామంలో కేజీ నుంచి  పీజీ వరకు కళాశాలలు,రైస్‌ మిల్లులు, కోళ్ళ ఫారాలతో అనపర్తి అభి వృద్ధి చెందింది.ఇప్పటికైనా పాలకులు దృష్టి పెట్టి అనపర్తిని నగర పంచా యతీగా మార్పు చేస్తే ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరై అనపర్తి మరింత అభివృద్ధి చెం దుతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. నాలుగు సార్లు నగర పంచా యతీగా మార్పు చెందిన ప్పటికీ రోజుల వ్యవధిలోనే ప్రతిసారి తిరిగి గ్రామ పంచా యతీగా మారడంతో కార్యాలయానికి ఎప్పుడు ఏ బోర్డు ఉంటుందోనని ప్రజలు ఆశక్తిగా ఎదురు చూసే వారు. అనపర్తి పంచా యతీ నగర పంచాయతీగా మార్పు చెందితే ప్రస్తుతం  పంచాయతీకి ఉన్న వంద షాపుల అద్దెలను వేలం వేయాల్సిన పరిస్థితి వస్తుందని దీంతో ఏళ్ళ తరబడి వ్యాపారం నిర్వహించుకుంటున్న తమ పరిస్థితి ఏమవు తుందోనని కొందరు వ్యాపారులు ఆందోళన చెందుతుండగా అనపర్తి నగర పంచాయతీగా మార్పు చెంది షాపుల అద్దెల వేలం నిర్వహిస్తే తమకు  కూడా షాపులు దక్కుతాయని పైగా రిజర్వేషన్లు కూడా ఉంటాయని అప్పుడైనా తమకు షాపులు దక్కుతాయని కొన్ని వర్గాల వ్యాపారులు ఎదురు చూస్తున్నారు. 


Updated Date - 2022-08-13T06:44:39+05:30 IST