రాష్ట్రంలో అరాచక పాలన

ABN , First Publish Date - 2021-10-18T05:05:57+05:30 IST

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని టీడీపీ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వీఎ్‌స అమీర్‌బాబు అన్నారు. ఆదివారం కోఆపరేటీవ్‌ కాలనీలోని ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రంలో అరాచక పాలన

టీడీపీ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వీఎ్‌స అమీర్‌బాబు 

కడప, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని టీడీపీ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వీఎ్‌స అమీర్‌బాబు అన్నారు. ఆదివారం కోఆపరేటీవ్‌ కాలనీలోని ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. కరెంటు కోత నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఏసీలు, ఫ్యాన్ల వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం లేదని, ఈ దుస్థితికి కారణమైన వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఓడించి, చంద్రబాబును మళ్లీ తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తీవ్రమైన విద్యుత్‌ లోటు ఉండేదని, చంద్రబాబు యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ లోటను భర్తీ చేశారని తెలిపారు. జగన్‌ వచ్చిన రెండున్నర ఏళ్లలోనే ఇప్పటికే 6 సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచడంతో పాటు, ట్రూ అప్‌ చార్జీల పేరిట జనంపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో జయకుమార్‌, నాసర్‌అలీ, మాసాకోదండ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-18T05:05:57+05:30 IST