‘రాష్ట్రంలో అరాచకపాలన’

ABN , First Publish Date - 2022-05-15T05:22:51+05:30 IST

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, దీనిని ప్రజలు గమనించాలని టీడీపీ నాయకులు కోరారు. రాష్ట్రంలో పెంచిన విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలు, నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా టీడీపీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ముకుందపురం, సుభలయ ఆర్‌ఆర్‌ కాలనీ, గురండి,ఆకుల తంపర గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.

‘రాష్ట్రంలో అరాచకపాలన’
హిరమండలం: సుభలయ ఆర్‌ఆర్‌ కాలనీలో ర్యాలీ చేస్తున్న టీడీపీ నేతలు

కొనసాగుతున్న టీడీపీ ‘బాదుడే బాదుడు’ నిరసనలు
మెళియాపుట్టి/హిరమండలం/కొత్తూరు:
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, దీనిని ప్రజలు గమనించాలని టీడీపీ నాయకులు కోరారు.  రాష్ట్రంలో పెంచిన విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలు, నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా టీడీపీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ముకుందపురం, సుభలయ ఆర్‌ఆర్‌ కాలనీ, గురండి,ఆకుల తంపర గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ..  రేట్లు అధికంగా పెంచి ప్రజలకు బతుకు లేకుం డా చేశారని విమర్శించారు. గిరిజనులకు సైతం నిధులు లేకుండా ఇతర పనులకు కేటాయిస్తున్నారన్నారు. కార్యక్రమంలో  జడ్పీటీసీ పొగిరి బుచ్చిబాబు, సర్పంచ్‌లు లంక రోజారాణి,  లొతుగెడ్డ భగవాన్‌ నాయుడు, టీడీపీ నాయకులు బాస్కర్‌గౌడో, శ్రీధర్‌, మాతల గాంధీ, చింతాడ కోటేశ్వరరావు, యు.వసంత్‌, గణపతిరావు, చక్రి, పరమేష్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
 

Read more