కమల్ ‘విక్రమ్‌’ సినిమాకు ‘కెజియఫ్‌’ టచ్‌

Jun 14 2021 @ 21:04PM

విశ్వనటుడు కమల్‌హాసన్‌, యువ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం ‘విక్రమ్‌’. ‘మాస్టర్‌’ చిత్రం తర్వాత లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించే చిత్రమిది. అయితే, ఈ చిత్ర ప్రకటన రోజునే ఓ టీజర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ఇందులో మలయాళ నటుడు భగత్‌ ఫాజిల్‌, విజయ్‌ సేతుపతిలతో పాటు మరికొందరు పెద్ద హీరోలు నటించనున్నారు. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ ఇప్పటివరకు రాలేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌... ఓ అప్‌డేట్‌ చేశారు. కవలలైన అన్బరివ్‌ సోదరులు ‘విక్రమ్‌’ చిత్రానికి స్టంట్‌ మాస్టర్లుగా పనిచేస్తారని తెలిపారు. 


‘కెజియఫ్‌-1’, ‘కెజియఫ్-2’, ‘ఖైదీ’, ‘సండైక్కోళి-2’, ‘కబాలీ’, ‘మద్రాస్‌’ వంటి చిత్రాలకు వీరు స్టంట్‌ మాస్టర్లుగా పనిచేశారు. కాగా, చిక్కుల్లో ఉన్న ‘ఇండియన్‌-2’ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు రాకపోయినప్పటికీ... ఇపుడు ‘విక్రమ్‌’ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్‌ అప్‌డేట్‌ను దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ వెల్లడించడంతో కమల్‌హాసన్‌ ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.