అలాంటి పని ఎప్పుడూ చేయను: వివాదంపై ప్రదీప్ స్పందన

Jun 21 2021 @ 17:02PM

ఇంటర్నెట్ డెస్క్: తెలుగు బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఓ షోలో ప్రదీప్ మాట్లాడుతూ ఏపీ రాజధాని విశాఖ అని వ్యాఖ్యానించి ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహానికి గురయ్యారు. ప్రదీప్ క్షమాపణ చెప్పకుంటే హైదరాబాద్‌లోని అతడి ఇంటిని ముట్టడిస్తామని ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాసరావు హెచ్చరించారు. కోర్టులో ఉన్న అంశాలపై యాంకర్ ప్రదీప్‌ ఎలా మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. రైతులు, ప్రజల మనోభావాలు కించపర్చేలా వ్యవహరిస్తే బుద్ధి చెబుతామని కొలికలపూడి శ్రీనివాసరావు హెచ్చరించడంతో వివాదం తీవ్రమైంది. దీంతో ఈ వివాదంపై యాంకర్ ప్రదీప్ స్పందించారు. తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిని ఉంటే క్షమించాలంటూ తన సొంత యూట్యూబ్ చానెల్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.


‘‘రీసెంట్‌గా జరిగిన ఓ షోలో రాష్ట్రం-దాని క్యాపిటల్ ఏంటి అనే ప్రశ్న అడుగుతున్న పద్ధతిలో నేను సిటీ పేరు చెప్పి, ఈ సిటీ క్యాపిటల్ ఏంటి అని అడగడం జరిగింది. మీ ప్రశ్న తప్పు అని చెప్పకుండా అవతలి వ్యక్తి వేరే ఆన్సర్ ఇవ్వడంతో ఈ పూర్తి సంభాషణ తప్పు దోవలో వెళ్లింది. అందరికీ వేరే విధంగా అర్థమవడంతో చాలా బాధ అనిపించింది. దీని ద్వారా ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా, ఎవరినైనా బాధ పెట్టినా.. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. ఇది ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదు. ఎవరినో కించపరచాలనో, హేళన చేయాలనే ఉద్దేశం ఎప్పుడూ ఉండదు. అలాంటి పని నేను ఎప్పుడూ చేయను. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుతున్నా’’ అంటూ ప్రదీప్ ఆ వీడియోలో పేర్కొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.