ఆడబిడ్డలకు అండ ‘కల్యాణలక్ష్మి’

ABN , First Publish Date - 2022-05-19T07:06:45+05:30 IST

రాష్ట్రంలో ఆడబిడ్డలకు అండగా ‘కల్యాణ లక్ష్మి’ పథకం ఉందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. బుధవారం మండలంలోని బేతవోలులో బుల్లెట్‌ వాహనంపై తిరుగుతూ 21మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.

ఆడబిడ్డలకు అండ ‘కల్యాణలక్ష్మి’
బేతవోలులో చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌

 చిలుకూరు, మే 18: రాష్ట్రంలో ఆడబిడ్డలకు అండగా ‘కల్యాణ లక్ష్మి’ పథకం ఉందని  ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు.  బుధవారం మండలంలోని బేతవోలులో బుల్లెట్‌ వాహనంపై తిరుగుతూ  21మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచార న్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ కొండాసైదయ్య, జడ్పీ కోప్షన్‌ సభ్యుడు జానీమియా, సొసైటీ చైర్మన్‌భాషం సైదులు, భట్టుశివాజి, తాళ్లూరి శ్రీను, జానకిరామాచారి, వేనేపల్లి ఉపేందర్‌, పాల్గొన్నారు.




Updated Date - 2022-05-19T07:06:45+05:30 IST