ఆపదలో అండగా ఉంటా : డాక్టర్‌ ఉగ్ర

ABN , First Publish Date - 2021-01-25T05:55:32+05:30 IST

టీడీపీ శ్రేణులు, తన అభిమానులు ఆపదలో ఉంటే వారికి అండగా ఉంటానని పార్టీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు.

ఆపదలో అండగా ఉంటా : డాక్టర్‌ ఉగ్ర
మాట్లాడుతున్న డాక్టర్‌ ఉగ్ర



కనిగిరి, జనవరి 24 : టీడీపీ శ్రేణులు, తన అభిమానులు ఆపదలో ఉంటే వారికి అండగా ఉంటానని పార్టీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం నగర పంచా యతీ నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ అధికారంలో ఉన్నా, లేకపోయినా ఎవరు ఏ కష్టంలో ఉన్నా తాను వెన్నంటి ఉంటానని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో కనిగిరి దుర్గంపై టీడీపీ బావుటా ఎగురవేయాలని ఆయన కోరారు. నియోజక వర్గం మొత్తం నూతన కమిటీలను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ సీనియర్‌ నాయకుల సూచనలు, సలహాలతో పార్టీ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని కోరారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉగ్ర అన్నారు.  వైసీపీ వైఫల్యాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెలుగు దేశం పార్టీకి నూతన యువనాయకత్వం ఎంతో అవసరమని యువకులు, విద్యా వం తులు, మేధావులు పార్టీలో చేరేలా నూతన కమిటీ కృషి చేయాలన్నారు.  కార్యక్రమంలో నగర పంచాయతీ ప్రఽధాన కార్యదర్శి కాసుల శ్రీరాములు, టీడీపీ నాయకులు దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, వీవీఆర్‌ మనోహర్‌రావు, జంషీర్‌ అహ్మద్‌, ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, గుడిపాటి ఖాదర్‌, రోషన్‌ సందాని, సద్గురు, గండికోట రమేష్‌, ఫిరోజ్‌, శ్రీరామ్‌ యాదవ్‌, పెన్నా కొండలు, యాసిన్‌, ఫారూక్‌, నాగూర్‌, సుబ్రమణ్యం, హరీష్‌, హజరత్‌ పాల్గొన్నారు. 

నగర పంచాయతీ నూతన కమిటీ

టీడీపీ కనిగిర నగర పంచాయతీ నూతన కమిటీని ఆదివారం డాక్టర్‌  ఉగ్ర ఏక గ్రీవం గా ఎంపిక చేశారు.  అధ్యక్షుడిగా తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, ప్రధాన కార్య దర్శిగా కాసు ల శ్రీరాములు, ఉపాధ్య క్షుడిగా షేక్‌ సలీ మ్‌, కార్య నిర్వాహక కార్య దర్శిగా షడ్రక్‌, ఎల్‌వీ ఆర్‌, దరిశి సుబ్ర మణ్యం, కార్యదర్శులుగా  చిలకపాటి బ్ర హ్మేంద్ర, చింతల పూడి తిరు పాలు, భూమి రెడ్డి శ్రీనివాసులరెడ్డి, కోశాధికా రిగా షేక్‌ జిలానీ, కార్యవర్గ సభ్యులుగా నర సింహ స్వామి, పెన్నా కొండలుయాదవ్‌, మో జేష్‌, రామసుబ్బారెడ్డి, బషీర, రాపూరి శ్రీను,  యలమంద, రిజ్వాన్‌, మస్తాన్‌బాబు,  శ్రీని వాసులు, షేక్‌ మహమ్మద్‌, షేక్‌ ఇస్మాయిల్‌ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 




Updated Date - 2021-01-25T05:55:32+05:30 IST