ఖతర్‌లో ఆంధ్ర కళా వేదిక ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం

ABN , First Publish Date - 2022-07-05T21:21:21+05:30 IST

భారత 75వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. స్వదేశంతోపాటు విదేశాల్లో కూడా ఘనంగా ఉత్సవాలను జరపుతోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వా

ఖతర్‌లో ఆంధ్ర కళా వేదిక ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: భారత 75వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. స్వదేశంతోపాటు విదేశాల్లో కూడా ఘనంగా ఉత్సవాలను జరపుతోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా విదేశాలలోని భారతీయ ఎంబసీలు నిరంతరం పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఖతర్‌లోని ప్రవాసాంధ్రుల సంఘమైన ఆంధ్ర కళా వేదిక ఇటీవల మెగా రక్తదాన శిభిరాన్ని ఏర్పాటు చేసింది. ఇండియన్ కల్చరల్ సెంటర్(ఐసీసీ), ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరం (ఐసీబీయఫ్)లతోపాటు నవయుగ సంస్థ ఈ కార్యక్రమ నిర్వహణకు తోడ్పాటందించినట్లుగా ఆంధ్ర కళా వేదిక అధ్యక్షుడు వెంకప్ప భాగవతుల ఒక ప్రకటనలో తెలిపారు.



కార్యక్రమంలో ఐసీసీ ప్రతినిధులు హెబ్బగులు సుబ్రమణ్యం, కే.యస్.ప్రసాద్, కృష్ణకుమార్ ఐసీబీయఫ్ నుంచి రజనీమూర్తి అతిథులుగా పాల్గొన్నట్టు ఆయన పెర్కోన్నారు. హామద్ మెడికల్ కార్పోరేషన్ (హెచ్.యం.సి)లో నిర్వహించిన రక్తదాన కార్యక్రమానికి వంద మందికిపైగా దాతలు రక్తదానం చేసినట్లుగా వెంకప్ప వెల్లడించారు. రక్తదానంలో నవయుగ సంస్ధ రెసిడెంట్ డైరెక్టర్ సిహ్.చ్. రవి కిషోర్ కీలక పాత్ర వహించారని ఆయన ప్రశంసించారు. కార్యక్రమంలో ప్రముఖ ప్రవాసీ సంఘాల నాయకులు కర్నాటక సంఘం అధ్యక్షుడు మహేశ్ గౌడ, తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు శంకర్ గౌడ్, తెలంగాణ ప్రజా సమితి ప్రధాన కార్యదర్శి పొట్ట వెంకటేశ్, తెలుగు ప్రవాసీ ప్రముఖులు మలిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, హరీష్ రెడ్డి, గొట్టిపాటి రమణలు పాల్గొని వలంటీర్లను అభినందించినట్టు చెప్పారు. విక్రం సుఖవాసి, విబికె మూర్తి, సుధ, శీరిష రాం, సాయి రమేశ్, సోమరాజు వలంటీర్లుగా ప్రముఖ పాత్రవహించారని ప్రకటనలో తెలిపారు.


Updated Date - 2022-07-05T21:21:21+05:30 IST