కమ్మగా... కొర్రబియ్యం కిచిడీ

ABN , First Publish Date - 2020-04-15T06:12:55+05:30 IST

కొర్రలు మన తాతల కాలం నుంచి తింటున్న ఆహారం. వీటితో చేసే వంటకాలు పోషకాలతో పాటు రుచికరంగానూ ఉంటాయి. భోజనంలోకి కొర్ర కిచిడీ...

కమ్మగా... కొర్రబియ్యం కిచిడీ

  • కొర్రలు మన తాతల కాలం నుంచి తింటున్న ఆహారం. వీటితో చేసే వంటకాలు పోషకాలతో పాటు రుచికరంగానూ ఉంటాయి. భోజనంలోకి కొర్ర కిచిడీ పెడితే ఇంటిల్లిపాదీ కమ్మగా తింటారు.

 

కావలసినవి: కొర్రలు - అరకప్పు , కంది, పెసర పప్పు- అరకప్పు నీళ్లు - 2 1/2 కప్పులు, క్యారెట్‌, బీన్స్‌, బఠాణీ, క్యాప్సికమ్‌ ముక్కలు - కప్పు, టొమాటో - 1, నెయ్యి - అర స్పూన్‌, తరిగిన అల్లం - టేబుల్‌ స్పూన్‌ , కారం, పసుపు, ఉప్పు - తగినంత.


తయారీ: కొర్రలు బాగా కడిగి గంటపాటు నానబెట్టుకోవాలి. కడాయి తీసుకొని నెయ్యి వేసి వేడిచేయాలి. జీలకర్ర వేసి చిటపటలాడేలా వేగించాలి. తరిగిన అల్లం వేసుకొని మంచి వాసన వచ్చేదాకా వేగించాలి. కూరగాయల ముక్కలు వేసి దోరగా వేగించి, పసుపు, ఉప్పు, కారం కలుపుకోవాలి. కడిగి ఆరబెట్టిన కొర్రలు, కందిపప్పు వేసి మూడు నిమిషాలు దోరగా వేగించి, నీళ్లు పోయాలి. ఉడికిన తరువాత బాగా కలిపి, నెయ్యి వేయాలి. అప్పడం, లేదా పచ్చడితో కలిపి వడ్డించుకుంటే కమ్మగా ఉంటుంది. 


Updated Date - 2020-04-15T06:12:55+05:30 IST