AP News: రాత్రి వేళ నిద్రిస్తున్న సమయంలో గజ్జెల శబ్దం...

ABN , First Publish Date - 2022-08-16T21:02:50+05:30 IST

ఏలూరు జిల్లా: రాత్రి వేళ నిద్రిస్తున్న సమయంలో గజ్జెల శబ్దం వస్తుందని ఇంటి యజమాని...

AP News: రాత్రి వేళ నిద్రిస్తున్న సమయంలో గజ్జెల శబ్దం...

ఏలూరు (Eluru) జిల్లా: రాత్రి వేళ  నిద్రిస్తున్న సమయంలో గజ్జెల శబ్దం (Groin sound) వస్తుందని ఇంటి యజమాని నట్టింట్లో పెద్ద గొయ్యి తీసి గుప్తనిధి (hidden treasure) కోసం అన్వేషిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లా, నూజివీడు మండలం, గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్యుని గృహాంలో 20 అడుగుల మేర భారీ సొరంగం బయటపడింది. ఇంట్లో రాత్రి వేళలో గజ్జెల శబ్దం రావటంతో, ఆ ప్రాంతంలో ఖచ్చితంగా గుప్తనిధులు ఉన్నాయనే అనుమానంతో కొందరు వ్యక్తుల సహాకారంతో ఇంటి యజమాని వేదాంతం శ్రీనివాసా చారి నట్టింట్లో త్రవ్వకాలు చేపట్టారు. షుమారు 20 అడుగుల లోతులో పెద్ద గొయ్యి తీసి నిధి, నిక్షేపాలను గుర్తించే సామాగ్రితో వారం రోజులుగా రాత్రింబావళ్ళు ఐదుగురు సభ్యుల ముఠా వెదుకులాటకు దిగింది.


పొరుగు ఇంటి ముందు రోజుకొక కారులో అపరిచిత వ్యక్తుల రాకపోకలపై అనుమానం వచ్చిన గ్రామస్తులు నూజివీడు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇంట్లో గొయ్యిని పరిశీలించి ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టుబడిన వారు నూజివీడు, విశాఖపట్నం, బెంగుళూరు ప్రాంతాల వారిగా గుర్తించారు. నూజివీడులో జమిందారుల కోటలు ఉండడంతో గతంలో పలుమార్లు అనేక మంది గుప్తనిధుల కోసం పురాతన ఆలయాలు, గుట్టలపై అన్వేషిoచిన దాఖలాలు అనేకం ఉన్నాయి.

Updated Date - 2022-08-16T21:02:50+05:30 IST