ఆనందయ్యకు ఏపీ ఆయూష్‌ శాఖ ఝలక్‌

ABN , First Publish Date - 2021-12-24T23:26:16+05:30 IST

ఆనందయ్యకు ఏపీ ఆయూష్‌ శాఖ ఝలక్‌ ఇచ్చింది. ఒమైక్రాన్ మందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఒమైక్రాన్‌కు ఆయుర్వేద మందు ఇస్తున్నట్లు..

ఆనందయ్యకు ఏపీ ఆయూష్‌ శాఖ ఝలక్‌

విజయవాడ: ఆనందయ్యకు ఏపీ ఆయూష్‌ శాఖ ఝలక్‌ ఇచ్చింది. ఒమైక్రాన్ మందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఒమైక్రాన్‌కు ఆయుర్వేద మందు ఇస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయూష్‌శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒమైక్రాన్‌కు ఆయూష్‌శాఖ ఎలాంటి మందు అనుమతించలేదని పేర్కొంది. ఆయుర్వేద మందు సరఫరాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలిపింది. గుర్తింపులేని మందును ఆయుర్వేద వైద్యంగా భావించవద్దని సూచించింది. వైద్యుల సలహాతోనే ఆయుర్వేద, హోమియో మందులు వాడాలని ఆయూష్‌ శాఖ ప్రకటించింది. 


Updated Date - 2021-12-24T23:26:16+05:30 IST