AP ICET నోటిఫికేషన్‌ విడుదల

ABN , First Publish Date - 2022-05-26T17:37:11+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి(Andhra Pradesh Higher Education Council) (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) - ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఐసెట్‌) 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ టెస్ట్‌ ద్వారా మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ), మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌

AP ICET నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి(Andhra Pradesh Higher Education Council) (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) - ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఐసెట్‌) 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ టెస్ట్‌ ద్వారా మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ), మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(ఎంసీఏ) ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఎగ్జామ్‌ని విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ(Andhra University) నిర్వహిస్తోంది. అభ్యర్థులు ప్రాక్టీస్‌ చేసుకోవడానికి వీలుగా వెబ్‌సైట్‌లో మాక్‌టెస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. 


అర్హత: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మూడు / నాలుగేళ్ల డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ద్వితీయ శ్రేణి మార్కులు తప్పనిసరి. ఎంసీఏ ప్రోగ్రామ్‌నకు ఇంటర్‌/ డిగ్రీ స్థాయిలో మేథమెటిక్స్‌ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. దూరవిద్య విధానంలో డిగ్రీ చేసినవారు, ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసిన/ రాస్తున్న/ రాసేవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు.  

ఐసెట్‌ వివరాలు: పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో మూడు సెక్షన్‌లు ఉంటాయి. మొత్తం 200 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ‘ఎ’ సెక్షన్‌లో అనలిటికల్‌ ఎబిలిటీ కింద డేటా సఫిషియెన్సీ నుంచి 20, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ 55 ప్రశ్నలు ఇస్తారు. ‘బి’ సెక్షన్‌లో కమ్యూనికేషన్‌ ఎబిలిటీ కింద ఒకాబులరీ నుంచి 15, ఫంక్షనల్‌ గ్రామర్‌ నుంచి 20, బిజినెస్‌ అండ్‌ కంప్యూటర్‌ టెర్మినాలజీ నుంచి 15, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ‘సి’ సెక్షన్‌లో మేథమెటికల్‌ ఎబిలిటీ కింద అర్థమెటికల్‌ ఎబిలిటీ నుంచి 35, ఆల్జీబ్రికల్‌ అండ్‌ జామెట్రికల్‌ ఎబిలిటీ నుంచి 10, స్టాటిస్టికల్‌ ఎబిలిటీ నుంచి 10 ప్రశ్నలు ఇస్తారు. ‘బి’ సెక్షన్‌లోని ప్రశ్నలను ఆంగ్ల మాధ్యమంలో; ‘ఎ’, ‘సి’ సెక్షన్‌లలోని ప్రశ్నలను తెలుగు, ఆంగ్ల మాఽధ్యమాల్లో ఇస్తారు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 200. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే అభ్యర్థులు కనీసం 50 (25 శాతం) మార్కులు తెచ్చుకోవాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ నిబంధన వర్తించదు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.650

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 10  

ఆన్‌లైన్‌ దరఖాస్తులో కరెక్షన్స్‌: జూలై 11 నుంచి 13 వరకు

హాల్‌ టికెట్స్‌ డౌన్‌లోడింగ్‌: జూలై 18 నుంచి

ఏపీ ఐసెట్‌ 2022 తేదీ: జూలై 25

ప్రిలిమినరీ కీ విడుదల: జూలై 27

ఫలితాలు విడుదల: ఆగస్టు 8న

వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in

Updated Date - 2022-05-26T17:37:11+05:30 IST