వైసీపీ నేతలకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

ABN , First Publish Date - 2022-04-28T16:03:03+05:30 IST

వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్ పార్టీ నేతలకు గట్టిగా క్లాస్ పీకారు.

వైసీపీ నేతలకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

విజయవాడ: ‘‘మీ గ్రాఫ్ బాగోలేదు. ఎన్నికల నాటికి గ్రాఫ్ పెరగకుంటే టిక్కెట్లు దక్కవు.. మీ నివేదికలు మా దగ్గర ఉన్నాయి. మరీ ముఖ్యంగా మంత్రులదే బాధ్యత.. అవసరమైతే తగ్గండి..’’ ఇదీ తాడేపల్లి కార్యాలయంలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో వైసీపీ నేతలకు సీఎం జగన్ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్. దీంతో గెలుపు ఆశలు సన్నగిల్లుతున్నాయని ఆ పార్టీ ఎంత ఆందోళన చెందుతుందో అర్ధమవుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్ పార్టీ నేతలకు గట్టిగా క్లాస్ పీకారు. సీఎంగా, అధ్యక్షుడిగా తన గ్రాఫ్ 65 శాతముందని, మీలో చాలా మంది గ్రాఫ్ 40 నుంచి 45 శాతం మాత్రమే అన్నారు. ఎన్నికల నాటికి  గ్రాఫ్ పెరగకుంటే నిర్ధాక్షిణ్యంగా మార్చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యేల పనితీరు, గ్రాఫ్ పడిపోతే సీటు ఇవ్వనని తేల్చి చెప్పారు. మంత్రులదే కీలక బాధ్యత అన్న ముఖ్యమంత్రి.. అవసరమైతే తగ్గి ప్రవర్తించాలన్నారు. మళ్లీ గెలిస్తేనే మంత్రి పదవి వస్తుందన్న సంగతి అందరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఇది ఆయా ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లేందుకు మరో అవకాశం ఇవ్వడమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.


Updated Date - 2022-04-28T16:03:03+05:30 IST