AP Finance‌ Commission‌ నియమించకపోవడంపై Highcourtలో విచారణ

ABN , First Publish Date - 2022-06-20T18:14:56+05:30 IST

ఏపీ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ నియమించకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

AP Finance‌ Commission‌ నియమించకపోవడంపై Highcourtలో విచారణ

Amaravathi: ఏపీ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ (AP Finance‌ Commission) నియమించకపోవడంపై  హైకోర్టు (Highcourt)లో పిటిషన్ దాఖలైంది. టీడీపీ (TDP) జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి (GV Reddy) న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీరించిన హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరుపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం పని చేస్తోందని, స్థానిక సంస్థల నిధుల కేటాయింపుపై ప్రభుత్వం నిబంధనలను పాటించడం లేదని న్యాయవాది వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (ఐ)కి వ్యతిరేకమని అన్నారు. వాదనలు విన్న అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీ రాజ్, పురపాలక శాఖ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది.

Updated Date - 2022-06-20T18:14:56+05:30 IST