AP: విద్యార్థులకు welcome పలుకుతున్న Problems

ABN , First Publish Date - 2022-07-05T16:33:18+05:30 IST

వేసవి సెలవులు విరామం తర్వాత మంగళవారం నుంచి ఏపీ (AP)లో పాఠశాలలు తెరుచుకున్నాయి.

AP: విద్యార్థులకు welcome పలుకుతున్న Problems

అమరావతి (Amaravathi): వేసవి సెలవులు విరామం తర్వాత మంగళవారం నుంచి ఏపీ (AP)లో పాఠశాలలు తెరుచుకున్నాయి. ఈ ఏడాది కూడా విద్యార్థులకు (students) నూతన విద్యా సంవత్సరంలో సమస్యలు (Problems) స్వాగతం (welcome) పలుకుతున్నాయి. కొన్ని పనులు జరిగినా ఎక్కువ చోట్ల మౌళిక సదుపాయాల సమస్యలు దర్శనమిస్తున్నాయి.


కిలోమీటరు దూరంలో ఉన్న ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తామన్నారు.. క్షేత్రస్థాయిలో విలీన ప్రక్రియకు తరగతి గదులు అడ్డంకిగా మారాయి.. సుమారు 50 శాతం పాఠశాలల్లో 3 నుంచి పది తరగతుల నిర్వహణకు సరిపడా గదులు లేవు.. పాఠశాలల్లో ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ చేపడతామని జీవో 117 ఇచ్చారు. ఇందులో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తిని పెంచేశారు. దీనివల్ల కొన్ని చోట్ల ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు.. 


బదిలీల ప్రక్రియ కూడా కొలిక్కి రాలేదు.. ఇవన్నీ పాఠశాలలు తెరిచేలోగా చేపట్టాల్సి ఉన్నా జరగలేదు. ఇప్పటికే గత నెల 28 నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు వస్తుండగా.. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో తరగతులు ప్రారంభం అవుతున్నాయి. ఈ రోజు నుంచి విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందించాల్సి ఉండగా.. పాఠశాలలకు జగనన్న విద్యా కానుకలు అరకొరగా చేరాయి. పాఠ్య పుస్తకాలు, విద్యా కానుక కిట్లు పూర్తిస్థాయిలో పాఠశాలలకు చేరకపోవడంతో.. ఈ నెల 5 నుంచి నెలాఖరు వరకూ పంపిణీ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది..


పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో చేరకపోవడంతో.. తీవ్ర గందరగోళం ఏర్పడింది.. విద్యా కానుక కిట్ల పంపిణీపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు..  దీని ప్రకారం రోజుకు పాఠశాలలో 30 నుంచి 40 మందికి మాత్రమే విద్యా కానుక కిట్లు అందుతాయి. ఎనిమిదో తరగతి సిలబస్‌ మారిన నేపథ్యంలో కొత్తగా పాఠ్యపుస్తకాలు రూపొందించారు.. పలు జిల్లాల్లో ఇప్పటికీ ఒక్క పుస్తకం కూడా జిల్లాకు రాలేదని తెలుస్తోంది. బడులు తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉన్నా ఇంకా మీనమేషాలు లెక్కించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. 

Updated Date - 2022-07-05T16:33:18+05:30 IST