CM Jagan Davos Tour సమాచారం అధికారులకు తెలియదట!...

ABN , First Publish Date - 2022-07-07T21:13:41+05:30 IST

సీఎం జగన్మోహన్ రెడ్డి దావోస్‌ పర్యటన సమాచారం ఆర్ధికాభివృద్ది బోర్డు అధికారులకు తెలియదట...

CM Jagan Davos Tour సమాచారం అధికారులకు తెలియదట!...

అమరావతి (Amaravathi): సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) దావోస్‌ పర్యటన (Davos Tour) సమాచారం అధికారులకు తెలియదట... దావోస్‌ విమాన ఖర్చులకు సంబంధించిన బిల్లులు తమకు అందలేదని ఆర్ధికాభివృద్ది బోర్డు పేర్కొంది. దావోస్‌ పర్యటనలో ముఖ్యమంత్రి లండన్‌ ఎందుకు వెళ్లారో వివరాలు లేవని బోర్డు చేతులెత్తేసింది. ఆర్ధిక సదస్సు మే 26వ తేదీన ముగిసినా... 31వ తేదీ వరకూ మధ్య కాలంలో ఎక్కడెక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్నారో తమ వద్ద వివరాలు లేవని అధికారులు పేర్కొన్నారు. దావోస్‌ పర్యటనలో నాలుగు ఒప్పందాలే కుదిరాయని అధికారులు అసలు విషయం తేల్చేశారు. 


గ్రీన్‌ కోతో ఎనిమిది వేల మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌లపై ఒప్పందం.. గ్రీన్‌ కోపై సంతకాలు చేసింది ఎవరో తెలుసా?... ఏపీకి చెందిన చలమశెట్టి అనీల్‌, అరబిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్‌లతో రెండు వేల మెగా వాట్ల పంపుడ్‌ హైడ్రో స్టోరేజ్‌, నాలుగు వేల మెగా వాట్ల సోలార్‌ విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లు, కాకినాడలో నెలకొల్పేందుకు ఒప్పందం కుదిరింది. ఎప్పుడూ హైదరాబాద్‌లో ఉండే అరబిందో అధికారులతో దావోస్‌లో ఒప్పందం... మచిలీపట్నానికి చెందిన ఏస్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌తో దావోస్‌‌లో ఒప్పందాలు.. ఈ నాలుగు ఒప్పందాల కోసమే దావోస్‌ పర్యటన అని సమాచార హక్కు చట్టం కింద ఆర్ధికాభివృద్ది బోర్డు అధికారులు సమాచారం ఇచ్చారు. 

Updated Date - 2022-07-07T21:13:41+05:30 IST