Andhrapradesh రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకోబోతోందా?

ABN , First Publish Date - 2022-08-30T01:18:56+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోఒక్కసారిగా తెలియని కుదుపు కనపడుతోంది. రాష్ట్రంలో బీజేపీ (Bjp), జనసేన (Janasena) పొత్తులో...

Andhrapradesh రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకోబోతోందా?

అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) ఒక్కసారిగా తెలియని కుదుపు కనపడుతోంది.  రాష్ట్రంలో బీజేపీ (Bjp), జనసేన (Janasena) పొత్తులో ఉన్నాయని ఆ పార్టీల నేతలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే ఇరువురు నేతలు కలిసి పోరాటాలు చేయకపోయినా..పైస్థాయిలో ఉన్న అవగాహన మేరకు పొత్తులో ఉన్న మాట వాస్తవం.  ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని.. బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నామని ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్  కూడా అన్నారు. తమకు ఆల్ రెడీ రోడ్ మ్యాప్ ఉందని అటు బీజేపీ కూడా స్పష్టం చేసింది. అయితే ఏపీలో బీజేపీ, టీడీపీ (Tdp), జనసేన పొత్తు (alliance) పెట్టుకోనున్నాయని తాజాగా జాతీయ మీడియాలో కథనం వచ్చింది. దసరా తర్వాత కేంద్ర కేబినెట్‌లో టీడీపీ చేరబోతోందని ప్రచారం జరుగుతోంది. 



ఈ నేపథ్యంలో  ‘‘ఏపీ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకోబోతోందా?. టీడీపీ, బీజేపీ మధ్య అవగాహన కుదిరిన మాట వాస్తమేనా?. ఏకంగా మోదీ కేబినెట్‌లో టీడీపీ చేరబోతోందా..?. ఒక్కసారిగా ఈ పరిణాలు జరగడానికి కారణాలేంటి?. బీజేపీని జనసేనాని పవన్ కల్యాణ్ అడిగిన రోడ్ మ్యాప్ ఇదేనా?. ఈ కూటమిపై ప్రజల్లో ఎలాంటి రియాక్షన్స్ వ్యక్తమవుతున్నాయి?. తాజా పరిణామాలు తెలంగాణ బీజేపీకి లాభిస్తాయా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Updated Date - 2022-08-30T01:18:56+05:30 IST