
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అవినీతి, అరాచక పాలన సాగుతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ధ్వజమెత్తారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కులరాజకీయాలతో పాలన సాగిస్తున్న వైసీపీకి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లిలో సువిశాలమైన భవనాలు నిర్మించుకున్న జగన్రెడ్డి కేంద్రం మంజూరు చేసిన పక్కాగృహాలను పేదలకు కట్టించలేకపోయారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీ జెండాను ఎగురవేయాలని కోరారు. ఉత్తరప్రదేశ్లో మోదీ, యోగి కలిసి చేసిన అభివృద్ధి విజయానికి దోహదం చేసిందని సత్యకుమార్ తెలిపారు.
ఇవి కూడా చదవండి