ఏపీ మోడల్‌ స్కూళ్ల టీచర్ల బదిలీకి ఉత్తర్వులు జారీ

ABN , First Publish Date - 2021-12-01T02:37:23+05:30 IST

మోడల్‌ స్కూల్స్‌లో ఉపాధ్యాయుల బదిలీలకు అనుమతులు ఇస్తూ పాఠశాల విద్యా ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. కనీసం రెండు సంవత్సరాల పాటు..

ఏపీ మోడల్‌ స్కూళ్ల టీచర్ల బదిలీకి ఉత్తర్వులు జారీ

అమరావతి: మోడల్‌ స్కూల్స్‌లో ఉపాధ్యాయుల బదిలీలకు అనుమతులు ఇస్తూ పాఠశాల విద్యా ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.  కనీసం రెండు సంవత్సరాల పాటు ఒకే చోట పని చేస్తున్న వారికి కూడా బదిలీ అవకాశం కల్పించారు. ఐదు సంవత్సరాలు దాటిన వారికి కచ్చితంగా ట్రాన్స్‌ఫర్లు చేయలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీలకు ఇతర ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులతో కలిపి కౌన్సిల్‌ నిర్వహించే ప్రక్రియ చేపట్టాలని ఆదేశింశారు. డిసెంబర్‌ 1 నుంచి 31 మధ్య ఈ బదిలీలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 


Updated Date - 2021-12-01T02:37:23+05:30 IST