AP లాసెట్‌, పీజీఎల్‌సెట్‌

ABN , First Publish Date - 2022-05-26T18:41:48+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి(Andhra Pradesh State Higher Education Council) (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) - లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం(Sri Padmavati Womens University) నిర్వహిస్తోంది. లాసెట్‌ ద్వారా అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ, మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు

AP లాసెట్‌, పీజీఎల్‌సెట్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి(Andhra Pradesh State Higher Education Council) (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) - లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం(Sri Padmavati Womens University) నిర్వహిస్తోంది. లాసెట్‌ ద్వారా అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ, మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. పీజీఎల్‌సెట్‌ ద్వారా రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం, ఎంఎల్‌ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్స్‌ ఇస్తారు. 


అర్హత

  • అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్‌/ తత్సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి. బీసీ అభ్యర్థులకు 42 శాతం; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు చాలు
  • మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి కనీసం 45 శాతం మార్కులతో డిగ్రీ/ పీజీ పూర్తిచేసి ఉండాలి
  • ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి అయిదేళ్లు/ మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రోగ్రామ్‌ లేదా బీఎల్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. 
  • బేసిక్‌ క్వాలిఫికేషన్‌ లేకుండా సింగిల్‌ సిట్టింగ్‌ ద్వారా డిగ్రీ/ పీజీ పూర్తిచేసినవారు దరఖాస్తుకు అనర్హులు. ఐటీఐ కోర్సులు చేసినవారు లాసెట్‌ రాయడానికి వీలు లేదు. 


లాసెట్‌ : ఇందులో మూడు పార్ట్‌లు ఉంటాయి. మొదటి పార్ట్‌లో జనరల్‌ నాలెడ్జ్‌, మెంటల్‌ ఎబిలిటీ అంశాల నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. రెండో పార్ట్‌లో కరెంట్‌ అఫైర్స్‌ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. మూడో పార్ట్‌లో ఆప్టిట్యూడ్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ లా నుంచి 60 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం గంటన్నర. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 120. ఇందులో అర్హత సాధించాలంటే కనీసం 42 మార్కులు (35 శాతం) రావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ నిబంధన వర్తించదు. అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నిర్వహించే ఎగ్జామ్‌లో ప్రశ్నలన్నీ ఇంటర్‌ స్థాయిలో; మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నిర్వహించే ఎగ్జామ్‌లో ప్రశ్నలన్నీ డిగ్రీ స్థాయిలో ఉంటాయి. లాసెట్‌ని ఇంగ్లీష్‌, తెలుగు మాధ్యమాల్లో నిర్వహిస్తారు. 


పీజీఎల్‌సెట్‌: ఇందులో రెండు పార్ట్‌లు ఉంటాయి. మొదటి పార్ట్‌లో జ్యూరిప్రుడెన్స్‌, కాన్‌స్టిట్యూషనల్‌ లా అంశాల నుంచి ఒక్కోదానిలో 20 ప్రశ్నలు అడుగుతారు. రెండో పార్ట్‌లో పబ్లిక్‌ ఇంటర్నేషనల్‌ లా, మర్కంటైల్‌ లా, లేబర్‌ లా, క్రైమ్స్‌ అండ్‌ టార్ట్స్‌, అదర్‌ లాస్‌ అంశాల నుంచి ఒక్కోదానిలో 16 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 120. పరీక్ష సమయం గంటన్నర. ఈ ఎగ్జామ్‌లో మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు, మ్యాచింగ్‌ ఐటెమ్స్‌ ఇస్తారు. ఇందులో అర్హత సాధించాలంటే కనీసం 30 మార్కులు(25 శాతం) రావాలి. ప్రశ్నపత్రాన్ని ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే ఇస్తారు.


ముఖ్య సమాచారం

లాసెట్‌ దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.900; బీసీ అభ్యర్థులకు రూ.850; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.800

పీజీఎల్‌సెట్‌ దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1000; బీసీ అభ్యర్థులకు రూ.950; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.900

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 13

ఆన్‌లైన్‌ దరఖాస్తులో కరెక్షన్స్‌: జూన్‌ 30 నుంచి జూలై 1 వరకు

హాల్‌టికెట్‌ల డౌన్‌లోడింగ్‌: జూలై 8 నుంచి

ఏపీ లాసెట్‌ 2022, ఏపీ పీజీఎల్‌సెట్‌ 2022 తేదీ: జూలై 13

వెబ్‌సైట్‌: cets.apsche.ap.gov.in

Updated Date - 2022-05-26T18:41:48+05:30 IST