బ్రేకింగ్ : ఏపీలో ఆగస్టు 16 నుంచి స్కూల్స్ ప్రారంభం

ABN , First Publish Date - 2021-07-23T19:08:50+05:30 IST

ఏపీలో ఆగస్టు- 16 నుంచి స్కూల్స్‌ పున: ప్రారంభం కానున్నాయి...

బ్రేకింగ్ : ఏపీలో ఆగస్టు 16 నుంచి స్కూల్స్ ప్రారంభం

అమరావతి : ఏపీలో ఆగస్టు- 16 నుంచి స్కూల్స్‌ పున: ప్రారంభం కానున్నాయి. కరోనా సెకండ్‌వేవ్‌ తగ్గడంతో స్కూల్స్‌ తెరవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. స్కూల్స్‌ పునఃప్రారంభంపై త్వరలోనే ఏపీ విద్యాశాఖ విధివిధానాలను వెల్లడించనున్నది. తొలి విడత నాడు-నేడు పనులకు కూడా ఆగస్టు 16న ప్రజలకు అంకితం చేయనున్నట్లు జగన్ సర్కార్ ఓ ప్రకటనలో తెలిపింది. విద్యార్థులకు విద్యాకానుక కిట్ కూడా అందజేయనున్నట్లు ఏపీ విద్యాశాఖ తెలిపింది. శుక్రవారం నాడు జరిగిన నాడు-నేడు సమీక్షలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై విధంగా నిర్ణయాలు తీసుకున్నారు.

Updated Date - 2021-07-23T19:08:50+05:30 IST