ఘనంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జెర్సీ లాంచింగ్

ABN , First Publish Date - 2022-07-05T04:11:23+05:30 IST

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జెర్సీ లాంచింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ జెర్సీలను ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, కలెక్టర్ మల్లికార్జున, సీపీ శ్రీకాంత్, జీవీఎంసీ కమిషనర్..

ఘనంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జెర్సీ లాంచింగ్

విశాఖ: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జెర్సీ లాంచింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది.  ఈ జెర్సీలను ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, కలెక్టర్ మల్లికార్జున, సీపీ శ్రీకాంత్, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా, మేయర్ హరి వెంకట కుమారి, గోపీనాథ్ రెడ్డి, శివారెడ్డి లంచ్ చేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ క్రికెట్ విపరీతమైన ఆదరణ ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాకారులకు కొదవ లేదని చెప్పారు. సరైన ప్రోత్సాహం లేక మరుగున పడిపోతున్నారని తెలిపారు. ‘‘ఏపీఎల్ టీ 20 టోర్నమెంట్‌కు బీసీసీఐ అనుమతి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎల్ నిర్వహించడం సంతోషం. క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ భయటపడుతుంది. ఐపీఎల్ తరహాలోనే ఏపీఎల్ విజయవంతమవుతుంది.’’ అని కలెక్టర్ అన్నారు. 


ఏసీఏ  ట్రెజరర్ గోపినాధ్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రా ఏపీఎల్ పెట్టడం గర్వంగా పీలవుతున్నామన్నారు. ఈ రోజు జెర్ర్సీ లాంజ్ చేశామని చెప్పారు.  ఫైనల్ 17‌న మ్యాచ్ ఉంటుందని పేర్కొన్నారు. ‘‘స్పోర్ట్స్ ప్రత్యేకంగా టెలికాస్ట్ చేస్తుంది. ఈ లీగ్ ముఖ్యంగా యువకుల టాలెంట్‌ను బయటకు తెస్తున్నాం. జాతీయ స్థాయిలో వాళ్ళు ఆడాలి.’’ అని గోపినాధ్ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-07-05T04:11:23+05:30 IST