APలో బూస్టర్ డోస్ ప్రారంభం

ABN , First Publish Date - 2022-01-10T17:21:43+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, వైద్యశాఖ సిబ్బందికి బూస్టర్‌ డోస్‌ సోమవారం ప్రారంభమైంది.

APలో బూస్టర్ డోస్ ప్రారంభం

విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, వైద్యశాఖ సిబ్బందికి బూస్టర్‌ డోస్‌ సోమవారం ప్రారంభమైంది. ఆయా ఆసుపత్రులలోనే వైద్య సిబ్బందికి మూడవ డోసు వ్యాక్సిన్‌ వేయనున్నారు. రెండవ డోసు వేసుకుని 9 నెలలు దాటిన వారికే బూస్టర్ డోసు ఇస్తారు. వైద్య శాఖలోని మొత్తం ఫ్రంట్ లైన్ వర్కర్లు బూస్టర్ డోసుకు అర్హులుగా గుర్తించారు. 12, 13 తేదీలలో ఇతర శాఖలలోని ఫ్రంట్ లైన్ వర్కర్లకి బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. మొత్తంగా 55 లక్షల మంది వృద్ధులలో రెండు డోసులు పూర్తి చేసుకున్న వారు లక్ష మంది ఉన్నారని అంచనా వేస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల సహకారంతో ఇళ్ల వద్దే బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. వైద్య శాఖ సిబ్బంది, పలు శాఖల ఫ్రంట్ లైన్ వర్కర్లు, వృద్ధులు కలిపి బూస్టర్ డోసు వేయాల్సిన వారు మొత్తం 5 లక్షల మంది ఉంటారని వైద్య శాఖ అంచనా వేస్తోంది. 

Updated Date - 2022-01-10T17:21:43+05:30 IST