Ap Deputy Cm Frustration: నిధుల్లేవ్.. పనుల్లేవ్.. అగమ్యగోచరంగా పరిస్థితి..!

ABN , First Publish Date - 2022-09-09T01:45:30+05:30 IST

బూడి ముత్యాలనాయుడు . రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ మధ్యనే డిప్యూటీ సీఎం అయ్యారు. అంతకుముందు ఆయన గతంలో లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవారు. ఉన్నారంటే ఉన్నారు.. అన్నట్లు ఉండేవారు. అలాంటి వ్యక్తికి జగన్‌రెడ్డి డిప్యూటీ సీఎం...

Ap Deputy Cm Frustration: నిధుల్లేవ్.. పనుల్లేవ్.. అగమ్యగోచరంగా పరిస్థితి..!

విశాఖ: బూడి ముత్యాలనాయుడు (Budi MutyalaNaidu).. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ మధ్యనే డిప్యూటీ సీఎం అయ్యారు. అంతకుముందు ఆయన గతంలో లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవారు. ఉన్నారంటే  ఉన్నారు.. అన్నట్లు ఉండేవారు. అలాంటి వ్యక్తికి జగన్‌రెడ్డి డిప్యూటీ సీఎం (Deputy Cm) పదవి కట్టబెట్టారు. అప్పటి నుండి ఆయనకు కొత్త చిక్కులు మొదలయ్యాయి. ఆయన తర్వాత రాజకీయ వారసత్వం కోసం కుటుంబంలోనే చీలికలు మొదలయ్యాయి. వాస్తవానికి.. ముత్యాలనాయుడికి ఇద్దరు భార్యలు కాగా.. ఇరువురికి ఓ కూమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. మొదటి భార్య మరణాంతరం ముత్యాలనాయుడు రెండో భార్య పిల్లలతోనే ఉంటున్నారు. 



మొదటి భార్య కుమార్తె వివాహం చేసుకుని ఆమెరికా (America)లో ఉంటుండగా.. కుమారుడు రవి రాజకీయాల్లో యాక్టివ్‌ రోల్‌ పోషిస్తున్నారు. జగన్ పాదయాత్ర నుంచి ఇప్పటివరకు వైసీపీ (Ycp)లోనే కొనసాగుతున్నారు. గతంలో దేవరాపల్లి జడ్పీటీసీ టిక్కెట్‌ అడిగితే ఇవ్వనందుకు రవి.. వైసీపీ రెబల్‌గా పోటీ చేసే పరిస్థితి ఏర్పడింది. అయితే.. కొందరు వైసీపీ నేతలు సర్ది చెప్పడంతో వెనక్కి తగ్గారు. అదే సమయంలో రాజకీయంగానూ తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారట. 


ఇదిలావుంటే.. ముత్యాల నాయుడు రెండో భార్య కుమార్తె అనురాధకు కె.కోటపాడు జడ్పీటీసీ టిక్కెట్టు ఇచ్చి ఆమెను గెలిపించారు. మరో కుమారుడు వెంకటేష్ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయితే ముత్యాలనాయుడికి డిప్యూటీ సీఎం పదవి వచ్చాక.. రవి, అనురాధ ఇద్దరూ రాజకీయాల్లో మరింత యాక్టివ్‌ అయ్యారట. కానీ రవి రాజకీయ ఎదుగుదలపై పెద్దగా ఆసక్తి చూపని మంత్రి, ఒక సమావేశంలో భవిష్యత్ రాజకీయ వారసురాలిగా అనురాధను ప్రకటించడంతో దుమారం రేగింది. పైగా నియోజకవర్గ భాధ్యతలను కూడా ఆమెకే అప్పగించారు. దీంతో రవి కూడా తగ్గేదే లేదని ఇప్పటికే నియోజకవర్గంలోని కొంతమంది నేతలతో టచ్‌లో ఉంటున్నారట.  సీఎం జగన్ (Cm jagan), విజయసాయిరెడ్డితో నేరుగా పరిచయాలు ఉన్న రవి.. భవిష్యత్‌లో నాయకత్వం కూడా తనవైపే ఉంటుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారట. దీంతో కుమారుడి దూకుడుతో ఇంటిపోరును ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక డిప్యూటీ సీఎం తల పట్టుకుంటున్నారట. 



మరోవైపు మొన్నటివరకూ సైలైంట్‌గా ఉన్న ముత్యాలనాయుడు ప్రస్తుతం రెచ్చిపోతున్నారట. ఎవరైనా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, సమస్యలు లేవనెత్తినా తట్టుకోలేకపోతున్నారట. ఆ మధ్యన ఓ సమావేశంలోనూ అధికారులపై కస్సుబుస్సులాడారట. అలాగే.. జడ్పీ సమావేశంలో సొంత గ్రామంలో మంచినీటి వ్యవస్థ బాగోలేదని చెప్పగా ఆగ్రహంతో తెగ ఊగిపోయారట. ముత్యాలనాయుడి తీరుతో అధికారులు నివ్వెరపోయారట. కానీ ఇప్పటికీ ఆ గ్రామంలో ఏం చేయలేని పరిస్థితీ నెలకొందట. ఆయన మంత్రి కాగానే కొంతమందితో కొన్ని పనులు స్పీడ్‌గా చేయించారు. అయితే పనులు అయిన తర్వాత డబ్బులు రాకపోవడంతో వారికి సమాధానం చెప్పలేక ఫ్రష్టేషన్‌కు గురవుతున్నారట. అంతేకాదు. నియోజకవర్గంలో రోడ్లు, సరియైన మౌలిక వసతులు లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. 


నిజానికి ముత్యాలనాయుడు అభివృద్ధి పనులు చేద్దామన్నా చేయలేకపోతున్నారట.  ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదట. దీంతో కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదట.  మరోవైపు పనులు చేసిన వారికి డబ్బులు ఇచ్చే పరిస్థితీ లేదట.  దీంతో ఏం చేయలేని పొజిషన్‌లో ఉన్నానని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. అందుకే.. సమాధానం చెప్పలేక ఎవరైనా ప్రశ్నిస్తే ఫ్రష్టేషన్.. ఫీక్‌ స్టేజ్‌కు వెళ్తుందట. జనాలతోనే ఇబ్బందులు తప్పడం లేదని నానా తంటాలు పడుతుంటే.. కొత్తగా ముత్యాలనాయుడికి మరో సమస్య వచ్చిపడిందట. డిప్యూటీ సీఎంగా ఉన్నా సరే.. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ (Gudivada amarnath).. విశాఖపై ఫోకస్‌ పెట్టడం ఆందోళన కలిగిస్తోందట. పైగా. అనకాపల్లిలో కూడా ఆయనే చక్రం తిప్పుతున్నారట. 


ఇక.. పక్కనున్న చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ (Mla Karanam Dharmasri)కి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడంతో ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారట. కానీ.. డిప్యూటీ సీఎం అయినప్పటికీ ముత్యాలనాయుడి హవా కొనసాగడం లేదట. దీంతో.. ఉంటే నియోజకవర్గంలో లేకుంటే అమరావతిలో ఉంటున్నారట. బాధలు బయటకు చెప్పలేక లోలోపల మదన పడుతున్నారట. కానీ.. ముత్యాలనాయుడును చూసినవారు మాత్రం మంత్రి అయ్యాక బాగా మారిపోయారని... పైగా.. ఫ్రష్టేషన్‌ కూడా పెరిగిపోయిందని అంటున్నారట. కానీ.. పాపం.. అసలు విషయాలు మాత్రం వాళ్లకి తెలీదని.. ఆయన బాధ దేవుడికే ఎరుక అంటున్నారు సన్నిహితులు. మొత్తానికి.. అధికారంలో ఉన్నా.. డిప్యూటీ సీఎంగా ఉన్నా.. ముత్యాలనాయుడి పరిస్థితి.. అగమ్యగోచరంగానే ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెలాంటి పరిస్థితులు నెలకొంటాయో...చూడాలి మరి..!



Updated Date - 2022-09-09T01:45:30+05:30 IST