పీఆర్సీపై జగన్‌కు నివేదిక.. అంశాలు ఇవే!

Published: Mon, 13 Dec 2021 21:20:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పీఆర్సీపై జగన్‌కు నివేదిక.. అంశాలు ఇవే!

అమరావతి: పీఆర్సీపై సీఎం జగన్‌కు సీఎస్ సమీర్ శర్మ నివేదిక అంజేశారు. అయితే ఈ నివేదికలో సీఎస్ కమిటీ పలు అంశాలను ప్రస్తావించింది. ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను కమిటీ సిఫార్సు చేసింది. 11వ వేతన సంఘం సిఫార్సులపైనా సీఎస్‌ కమిటీ నివేదిక ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. 2018-19లో జీతాలు, పెన్షన్ల రూపేణా చేసిన వ్యయం రూ.52,513 కోట్లు అని, 2020–21 నాటికి ఆ వ్యయం రూ.67,340 కోట్లకు చేరిందని సీఎస్‌ కమిటీ తెలిపింది. 2018-19లో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయం (ఎస్‌ఓఆర్‌)లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల మొత్తం 84 శాతమని, 2020-21 నాటికి ఇది 111 శాతానికి చేరుకుందని సీఎస్ కమిటీ పేర్కొంది.


‘‘ప్రభుత్వ మొత్తం వ్యయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం 2018-19లో 32 శాతమైతే, 2020-21 నాటికి 36 శాతానికి పెరిగింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ వ్యయం ఏపీలోనే అధికం. 2020-21లో తెలంగాణలో ఇది కేవలం 21 శాతమే. ఛత్తీస్‌గఢ్‌లో 32 శాతం, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లో 31 శాతం, ఒడిషా 29, మధ్యప్రదేశ్‌ 28, హర్యానా 23 శాతమేనని సీఎస్‌ కమిటీ పేర్కొంది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.