అమరావతి: ముఖ్యమంత్రి వికేంద్రీకరణ నిర్ణయం, మూడు రాజధానాలు ప్రకటనతో ఆందోళనతో రాజధానిలో మరో మైనారిటీ యువకుడు బలయ్యాడు. రాజధాని గ్రామం రాయపూడకి చెందిన మైనార్టీ యువకుడు షేక్ ఇస్మాయిల్ రైతు కూలీ. గత మూడు సంవత్సరాలుగా రాజధానిలో పనులు నిలిచిపోవడం ఇస్మాయిల్ జీవన ఉపాధి కోల్పోయాడు. తన కుటుంబ పోషణ భారమై ఆర్థిక ఇబ్బందులతో యువకుడు బాధపడుతున్నాడు. ఈ క్రమంలో నిన్న అసెంబ్లీలో మూడు రాజధానులపై ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనతో ఇస్మాయిల్ మళ్ళీ ఆవేదన చెందాడు. తీవ్ర మనస్థాపానికి గురైన ఇస్మాయిల్ గత రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. ముఖ్యమంత్రి ప్రకటనను తట్టుకోలేకే రాత్రి వరకూ ఆలోచిస్తూ గుండెపోటుతో ఇస్మాయిల్ మరణించాడని గ్రామస్తులు చెబుతున్నారు. గుండెపోటుకు గురైనా యువకుడిని కుటుంబసభ్యులు అర్ధరాత్రి మంగళగిరి ఎన్నారై ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇస్మాయిల్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబసభ్యుల కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి