ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

ABN , First Publish Date - 2022-07-12T03:22:31+05:30 IST

ఐఎండీ సూచనల ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి అనుకుని అల్పపీడనం కొనసాగుతోందని విపత్తుల సంస్థ ఎండీ డా.బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. దీని ప్రభావంతో...

ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

అమరావతి: ఐఎండీ సూచనల ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి అనుకుని అల్పపీడనం కొనసాగుతోందని విపత్తుల సంస్థ ఎండీ డా.బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మంగళవారం అక్కడక్కడ భారీ వర్షాలు, ఎల్లుండి అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. రానున్న 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని.. మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్లరాదని, ఎగువ నుంచి వస్తున్న వరద, భారీవర్షాల నేపధ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  హెచ్చరించారు. 

Updated Date - 2022-07-12T03:22:31+05:30 IST