చేపల చెరువుల తవ్వకాలకు బ్రేక్‌

Jun 19 2021 @ 23:44PM

పుట్టగుంటలో ఆక్రమణలు అడ్డుకున్న అధికారులు

ఎక్స్‌కవేటర్లు, జేసీబీలు తొలగించని అక్రమార్కులు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

నందివాడ రూరల్‌  (గుడివాడ), జూన్‌ 19 : నందివాడ మండలం పుట్టగుంటలో ప్రభుత్వ భూమికి పట్టా పుట్టించి అక్రమంగా తవ్వుతున్న చేపల చెరువుల పనులను రెవెన్యూ అధికారులు శనివారం సాయంత్రం నిలిపివేశారు. ‘అవకతవకలు.. అక్రమ తవ్వకాలు..’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో శనివారం ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అయితే, అధికారులు పనులు నిలిపి వేయించినా ఎక్స్‌కవేటర్లు, జేసీబీలు, ట్రాక్టర్లు మాత్రం పక్కనే ఉన్న భూముల్లో నిలిపి ఉంచటం అనుమానాలకు తావిస్తోంది. పనులు ఆపుతామని చెప్పిన అధికారుల ఆదేశాలు ఏ మేరకు అమలవుతాయో చూడాలి. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.