తల్లిపై దాడి చేసి పసిపాపను చెత్తబుట్టలో పడేసిన ఆయా

ABN , First Publish Date - 2020-10-15T06:41:24+05:30 IST

ఎనిమిది నెలల పసికందును చెత్తబుట్టలో పడేసిన బేబీసిట్టర్(ఆయా)ను న్యూ హ్యావెన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన

తల్లిపై దాడి చేసి పసిపాపను చెత్తబుట్టలో పడేసిన ఆయా

న్యూ హ్యావెన్, కనెక్టికట్: ఎనిమిది నెలల పసికందును చెత్తబుట్టలో పడేసిన బేబీసిట్టర్(ఆయా)ను న్యూ హ్యావెన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనెక్టికట్ రాష్ట్రంలోని న్యూ హ్యావెన్‌కు చెందిన ఆండియానా వెలెజ్(24) అనే యువతి అక్కడే ఓ ఇంట్లో బేబీసిట్టర్‌గా పనిచేస్తోంది. గత సోమవారం పాప తల్లితో ఘర్షణకు దిగిన ఆండియానా ఆమెపై దాడికి దిగింది. అనంతరం అభంశుభం తెలియని పసిపాపను బయటకు తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేసింది.


మెయింటెనెన్స్ వర్కర్లు పాపను గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. తాము చూసేసరికి పాప వణుకుతోందని వర్కర్లు తెలిపారు. పాపకు తీవ్రగాయాలయ్యాని, చేతిపై కాలిన గాయాలు కూడా ఉన్నట్టు చెప్పారు. పాప ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఇక ఆండియానాపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. పసిపాపను చెత్తబుట్టలో పడేసినందుకు, పాప తల్లిపై దాడికి దిగినందుకు ఆమెపై వివిధ కేసులను పెట్టారు.

Updated Date - 2020-10-15T06:41:24+05:30 IST