Advertisement

మార్కెట్‌యార్డ్‌ ఎదుట రైతు కుటుంబం ఆందోళన

Apr 22 2021 @ 23:42PM
ఆందోళన చేస్తున్న రైతు కుటుంబసభ్యులు

ఏన్కూరు, ఏప్రిల్‌ 22: మిర్చి కొనుగోలు చేసిన వ్యాపారి తమకు డ బ్బులు ఇవ్వకుండా ఇ బ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ ఓరైతు కుటుంబసభ్యులు మార్కెట్‌యార్డు ఎదుట గురువారం సాయంత్రం ఆందోళన చేశారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని టీఎల్‌పేట గ్రామానికి చెందిన ఇమ్మడి శ్రీను అనే రైతు ఏన్కూరుకు చెందిన ఓ వ్యాపారికి గత డిసెంబరులో 27క్వింటాళ్ల మిర్చిని రూ.3.60లక్షలకు అమ్మాడు. అయితే ఆ వ్యాపారి అప్పట్లో రూ.60వేలు ఇచ్చాడు. మిగతా రూ.మూడులక్షల కోసం ఇబ్బందులు పెడుతున్నాడు. రైతు ఆ వ్యాపారి చుట్టూ పలుమార్లు తిరిగి డబ్బులు ఇవ్వమని అడిగినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. పైగా తాను ఇచ్చేది లేదంటూ వ్యాపారి బుకాయించటంతో కంగుతిన్న రైతు కుటుంబసభ్యులతో కలిసి గురువారం మార్కెట్‌యార్డు ఎదుట ఆందోళనకు దిగారు. తమకు డబ్బులు ఇవ్వకుండా వ్యాపారి ఇబ్బందులు పెడుతున్నాడని పైగా ఇచ్చేది లేదంటూ బెదిరిస్తున్నాడని తమకు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని ఆందోళన చేశారు. గేట్లు వేసి ఆందోళన చేయటంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పారు. స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని విచారణ చేసి తగిన న్యాయం చేస్తామని పోలీసులు చెప్పటంతో వారు ఆందోళన విరమించారు.


Follow Us on:
Advertisement