నగ్నంగా నటించిన ఆండ్రియా..!

Jun 13 2021 @ 15:27PM

తమిళ చిత్రసీమలోని గాయ‌నిగా, హీరోయిన్‌గా త‌న‌కంటూ గుర్తింపు సంపాదించుకున్న వారిలో  ఆండ్రియా ఒకరు. ఈమె న్యూడ్ సీన్‌లో నటించినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకెళ్తే.. అండ్రియా కథా ప్రాముఖ్యత కలిగిన చిత్రాల్లో నటించేందుకు అధిక ప్రాధాన్యత చూపిస్తోంది. ఇప్పుడీ అమ్మ‌డు నటిస్తున్న చిత్రాల్లో  ‘పిశాసు-2’ చిత్రం ఒకటి. మిష్కిన్ దర్శకత్వంలో 2016లో విడుదలైన ‘పిశాసు’ చిత్రం రెండో భాగమే ఈ చిత్రం. కార్తీక్‌ రాజా సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో పూర్ణ, రాజ్‌కుమార్‌, పిచ్చుమణిలు ప్రధాన పాత్రలను పోషిస్తుండగా, విజయ్‌ సేతుపతి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ కొన్ని నెలల క్రితం విడుదలై అంద‌రినీ ఆకర్షించింది. ఈ చిత్రం కోసం దిండిగల్‌లో ప్రత్యేక సెట్‌ను వేసి షూటింగ్‌ జరిపారు. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ నిలిపివేయడంతో డబ్బింగ్‌ వంటి పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే, ఈ చిత్రంలో ఒకానొక సందర్భంలో ఆమె నగ్నంగా నటించినట్టు వార్తలు వస్తున్నాయి. కథ డిమాండ్‌ చేయడంతో దర్శకుడు మిష్కిన్‌ వినతి మేరకు ఆండ్రియా ఈ సాహసం చేసినట్టు చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఈ న్యూడ్‌ సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో లొకేషన్‌లో అతికొద్దిమంది మాత్రమే వుండేలా చర్యలు తీసుకుని, ఆ సన్నివేశాలను పూర్తి చేశారు. గత 2019లో ‘ఆడై’ చిత్రం కోసం అమలాపాల్‌ నగ్నంగా నటించిన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.