ఆకట్టుకునే ఫీచర్లతో ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌

ABN , First Publish Date - 2022-05-14T08:45:02+05:30 IST

ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు చెందిన సెకండ్‌ బేటా విడుదలకు గూగుల్‌ సన్నాహాలు చేస్తోంది. ఆండ్రాయిడ్‌ ఫోన్లు, టాబ్లెట్లు, ఫోల్డబుల్‌ డివైస్‌లు

ఆకట్టుకునే ఫీచర్లతో ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌

ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు చెందిన సెకండ్‌ బేటా విడుదలకు గూగుల్‌ సన్నాహాలు చేస్తోంది. ఆండ్రాయిడ్‌ ఫోన్లు, టాబ్లెట్లు, ఫోల్డబుల్‌ డివైస్‌లు అన్నింటికీ వర్తింపజేస్తోంది. ఫస్ట్‌బేటా నిర్మాణం పూర్తయిన తరవాత కొద్దివారాలకే సెకండ్‌ బేటా విడుదల కానుంది. ఇంతకీ ఇందులో కొత్తదనం ఏమిటి అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


  • సెక్యూరిటీ, యూజర్‌ ప్రైవసీపై ఎక్కువ ఫోకస్‌ పెడుతుంది. యూనిఫైడ్‌ సెక్యూరిటీ అండ్‌ ప్రైవేట్‌ సెట్టింగ్స్‌ పేజీని ఆండ్రాయిడ్‌ 13లోకి ఈ ఏడాది చివర్లో తీసుకురానున్నారు. దాంతో డివైస్‌కు చెందిన డేటా ప్రైవసీ, సెక్యూరిటీ - ఫ్రంట్‌, సెంటర్‌లోకి వస్తాయి. అవి స్పష్టమైన కలర్‌- కోడెడ్‌ ఇండికేటర్‌ను ప్రొవైడ్‌ చేస్తాయి. సెక్యూరిటీ పెంపు కోసం సేఫ్టీ స్టేటస్‌కు తోడు సంబంధిత మార్గదర్శకత్వం కూడా వహిస్తుంది. 
  • ఫోన్‌కు డిఫరెంట్‌ లుక్‌ అందిస్తుంది. గూగుల్‌ గత ఏడాది  గూగుల్‌ వినియోగదారులకు ‘స్టయిల్‌ అండ్‌ ప్రిఫరెన్సెస్‌’ని అందించింది. ఆండ్రాయిడ్‌ 13తో మరింత ముందుకు వెళుతోంది. ప్రీ-మేడ్‌ కలర్‌ వేరియంట్స్‌ను అందిస్తోంది. ఒకసారి కలర్‌ స్కీమ్‌ను ఎంపిక చేసుకుంటే, ఔస్‌ యావత్తు కలర్‌ వేరియంట్స్‌(వేర్వేరు)ను చూసుకోవచ్చు. వాల్‌పేపర్‌,   స్టయిల్‌ని మార్చుకోవచ్చు.
  • యాప్‌ ఐకాన్స్‌కు కలర్‌ థీమింగ్‌ మరొకటి. పిక్సల్‌ డివైసెస్‌తో మొదలుపెట్టి థీమ్డ్‌ ఐకాన్స్‌కు టర్న్‌ ఆన్‌ చేసుకోవచ్చు. సెట్టింగ్స్‌లో టోగెల్‌ ద్వారా ఫోన్‌ రంగుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. 
  • వివిధ భాషలకు వేర్వేరు యాప్స్‌ ఉపయోగించుకోవచ్చు. ఒక్కో యాప్‌ సెట్టింగ్‌కు ఒక లాంగ్వేజ్‌ను ఎంచుకునే సౌలభ్యం కలుగుతుంది. సోషల్‌ మీడియా చాటింగ్స్‌ ఒక భాషలో బ్యాంకింగ్‌ యాప్స్‌ను ఇంకో లాంగ్వేజ్‌లో ఉపయోగించుకోవచ్చు. రాబోయే వెర్షన్‌ అందుకు అనుకూలంగా ఉంటుంది. 
  • పర్సనల్‌ సమాచారాన్ని పద్ధతైన విధానంలో షేర్‌ చేసుకునే వెసులుబాటు సెకండ్‌ బేటాతో యూజర్లకు లభిస్తుంది. పర్సనల్‌ సమాచారంపై మరింత అదుపు(కంట్రోల్‌) యూజర్లకు లభిస్తుంది. ఏయే ఫైల్స్‌ను మీ యాప్‌లు యాక్సెస్‌ చేయవచ్చనే విషయంలో యూజర్లకే కంట్రోల్‌ ఉంటుంది. ఫైల్స్‌ అండ్‌ మీడియా స్థానంలో రెండు కేటగిరీలు వస్తాయి. ‘ఫొటోస్‌ అండ్‌ వీడియోస్‌’, ‘మ్యూజిక్‌ అండ్‌ ఆడియో’ ఉంటాయి. మీ యాప్‌లో ఉన్న యావత్తు మీడియా లైబ్రరీని షేరింగ్‌ చేయకుండానే ఈ కొత్త పద్ధతిలో కావాల్సిన ఫొటోలు, వీడియోలను మాత్రమే పిక్‌ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. 
  • ఆటో-డిలీట్‌ క్లిప్‌బోర్డ్‌ హిస్టరీ మరొకటి. రిస్క్‌కు దూరంగా ఉండేందుకు టైమ్లీ యూజర్‌ వ్యక్తిగత గోప్యతను పెంచుతోంది. ఏదైనా యాప్‌ మీ క్లిప్‌ బోర్డ్‌ యాక్సెస్‌ పొందిన వెంటనే అలెర్ట్‌ వస్తుంది. అంతేకాకుండా క్లిప్‌బోర్డ్‌ హిస్టరీని కొద్దిసేపట్లోనే ఆటోమేటిక్‌గా డిలీట్‌ చేస్తుంది. తద్వారా ఓల్డ్‌ కాపీడ్‌ సమాచారాన్ని ముందస్తుగానే బ్లాక్‌ చేస్తుంది. 
  • ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో మొదటిసారి యాప్‌ని ఉపయోగించినప్పుడు  కెమెరా, మైక్రోఫోన్‌, బ్లూటూత్‌, కాల్‌ రికార్డుల తదితరాలకు యాక్సెస్‌ ఇవ్వాలంటూ రిక్వెస్టులు రావడం తెలిసిందే. కొత్త వెర్షన్‌తో నోటిఫికేషన్స్‌ పంపేందుకు పర్మిషన్‌ అడుగుతుంది. ఇదేదో పెద్ద ఫీచర్‌ కానప్పటికీ, అనవసరమైన అలెర్ట్‌లను తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ  ఫీచర్‌ దాదాపుగా యాపిల్‌ స్మార్ట్‌ఫోన్లలో మాదిరిగానే ఉంటుంది. 
  • ఫ  యాప్స్‌తో ఇన్ఫర్మేషన్‌ షేరింగ్‌ కంట్రోల్‌ కూస్తంత ఎక్కువగా ఉంటుంది. ఏదైనా యాప్‌ కెమెరా లేదంటే కాంటాక్ట్‌ యాక్సెస్‌ కావాలని అనుకుంటే యాక్సెస్‌ కోసం అడగాల్సిన పనిలేదు.  ఆండ్రాయిడ్‌ ఆటోమేటిక్‌గా పర్మిషన్స్‌ ఇచ్చేస్తుంది. అయితే గూగుల్‌ ఈ విషయంలో డెవలపర్స్‌కు ఈ తప్పనిసరి చేసిందా లేదా అన్నది తెలియదు. 
  • బ్లూటూత్‌లో ఎనర్జీ(ఎల్‌ఈ) సపోర్టును పొందుతుంది. ఇది తదుపరి జనరేషన్‌కు చెందినది. దీంతో ఆడియోలను స్నేహితులతో షేర్‌, బ్రాడ్‌కాస్ట్‌కు వీలు ఉంటుంది. బ్యాటరీని త్యాగం చేయకుండానే హై ఫిడిలిటీ ఆడియోను పొందే వీలు చిక్కుతుంది. 
  • మీడియా కంట్రోల్‌ను రీడిజైన్‌ చేసింది. ఆల్బమ్‌ తాలూకు ఆర్ట్‌ వర్క్‌ ఫీచరింగ్‌తో వింటున్న మ్యూజిక్‌కు అనుగుణంగా ఉంటుంది. ఈ కొత్త డిజైన్‌ లాక్‌స్ర్కీన్‌ అలాగే నోటిఫికేషన్‌ ప్యానెల్‌లో కనిపిస్తుంది.  

Read more