అంగన్‌వాడీ కేంద్రాల నిర్వీర్యం

ABN , First Publish Date - 2022-01-23T05:11:14+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాల లక్ష్యానికి విరుద్ధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని నిర్వీర్యం చేస్తున్నాయని అంగన్‌వాడీ వర్క్‌ర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు.

అంగన్‌వాడీ కేంద్రాల నిర్వీర్యం
యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ

నెల్లూరు(వైద్యం) జనవరి 22 : అంగన్‌వాడీ కేంద్రాల లక్ష్యానికి విరుద్ధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని నిర్వీర్యం చేస్తున్నాయని అంగన్‌వాడీ వర్క్‌ర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. శనివారం సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆ యూనియన్‌ జిల్లా మహాసభలు జరిగాయి. ముఖ్య అతిఽథిగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలన్నారు. ఐసీడీఎస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేయాలని కోరారు. 172 జీవోను అసంబద్ధంగా విడుదల చేసి  కేంద్రాలను  ప్రాథమిక స్కూల్‌లో విలీనం చేస్తామని ప్రభుత్వం ప్రకటించటం అన్యాయమన్నారు. పలువురు వ్యక్తలు మాట్లాడుతూ అంగన్వాడీ లకు పనిభారం పెరిగిందన్నారు. కనీసం అంగన్వాడీలకు తగిన గుర్తింపు కూడా లేదని  ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం అమలు చేయాలని కోరారు.  అంగన్‌వాడీలు దీర్ఘకాలింగా ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూజిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్‌, అన్నపూర్ణమ్మ, షాహినాబేగం  పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-23T05:11:14+05:30 IST