ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీల ధర్నా

ABN , First Publish Date - 2021-07-27T04:08:04+05:30 IST

నాయుడుపేట - శ్రీకాళహస్తి బైపాస్‌రోడ్డు సమీపంలో ఉన్న ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు ఽసోమవారం ధర్నా చేశారు.

ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీల ధర్నా

నాయుడుపేట టౌన్‌, జూలై 26 : నాయుడుపేట - శ్రీకాళహస్తి బైపాస్‌రోడ్డు సమీపంలో ఉన్న ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు ఽసోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీల యూనియన్‌ ప్రాజెక్టు కార్యదర్శి శ్యామలమ్మ మాట్లాడుతూ అంగన్‌వాడీ సెంటర్‌ నిర్వహణ కోసం కొత్త ఫోన్‌, ట్యాబ్‌ మంజూరు చేయాలని, నిర్వహణలో ఎంఎస్‌కేల జోక్యం రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. సీడీపీవో, సూపర్‌ వైజర్‌ పర్యవేక్షణలో లబ్ధిదారులకు ఫీడింగ్‌ అందించాలని కోరారు. అనంతరం సూపర్‌ వైజర్‌ జ్యోతికిరణ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు మేరీ ప్రమీలా, పెంచలమ్మ, సుకుమారి, విజయమ్మ,  అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T04:08:04+05:30 IST