అంగన్‌వాడీ కార్యకర్తల ధర్నా

ABN , First Publish Date - 2021-07-27T03:16:49+05:30 IST

స్థానిక అర్బన్‌ సీడీపీవో కార్యాలయం వద్ద సోమవారం అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ఆఽధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

అంగన్‌వాడీ కార్యకర్తల ధర్నా
ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్ఫర్స్‌ యూనియన్‌ నాయకులు

గూడూరురూరల్‌, జూలై 26: స్థానిక అర్బన్‌ సీడీపీవో కార్యాలయం వద్ద సోమవారం అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ఆఽధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంగన్‌వాడీ సెంటర్ల నిర్వహణ కోసం ఫోన్‌లు, ట్యాబ్‌లు అంద జేయాలన్నారు. లబ్ధిదారులతో బయోమెట్రిక్‌ వేయించకపోతే వేతనాల్లో కోత విధిస్తామని ఒత్తిడి తెస్తున్నారన్నారు. 2017లో ఇచ్చిన ఫోన్లు 90 శాతం పాడైపోయాయన్నారు. ఆర్థిక స్థోమత లేనివారు ఫోన్లు కొనుక్కోలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాజకీయ వేధింపులను ఆరికట్టా లన్నారు. కార్యక్రమంలో సుబ్బరావమ్మ, బేబిరాణి, హెప్సిబా, యాదగిరి, బీవీ రమణయ్య, మణి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T03:16:49+05:30 IST