‘అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి’

ABN , First Publish Date - 2020-08-08T09:50:50+05:30 IST

అంగన్‌వాడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ కార్యనిర్వాహక జిల్లా అధ్యక్షుడు ..

‘అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి’

ఆదోని(అగ్రికల్చర్‌), ఆగస్టు 7:  అంగన్‌వాడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ కార్యనిర్వాహక జిల్లా అధ్యక్షుడు అజయ్‌బాబు, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు వీరేష్‌ కోరారు. శుక్రవారం అంగన్‌వాడీ వర్కర్లతో కలిసి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను  ప్రజలకు అందించడంలో అంగన్‌వాడీ వర్కర్లు ముందుంటారన్నారు. వారికి ఇచ్చే గౌరవ వేతనం ప్రస్తుత పరిస్థితుల్లో  సరిపోదన్నారు. ప్రభుత్వం గౌరవ వేతనం పెంపుతో పాటు ఈఎ్‌సఐ, పీఎ్‌ఫతో పాటు పింఛన్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం ఆర్డీవో మోహన్‌దాసుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్లు శారద, జానకి, వెంకటలక్ష్మి, సుశీల, మేరి, విజయ్‌ పాల్గొన్నారు. 


ఆదోని రూరల్‌: అంగన్‌వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ నాయకులు లక్ష్మన్న, మహానందరెడ్డి, గోపాల్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం అర్బన్‌ అంగన్‌వాడీ కేంద్రం ముందు వర్కర్లతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.  అంగన్‌వాడీలకు నెలకు రూ.21 వేలు వేతనం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో నాయకురాలు వెంకటమ్మ, సరోజమ్మ, పద్మ, లలిత, చంద్రావతి పాల్గొన్నారు. 


కొలిమిగుండ్ల: అంగన్‌వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి శేభా డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి జీతాలు పెంచాలని, పనిభారం తగ్గించాలనే డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏఎస్‌వో భాస్కర్‌రెడ్డికి అందించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి వేణుగోపాల్‌, అంగన్‌వాడీ కార్యకర్తలు రేణుక, త్రివేణి, పద్మావతి, జూనియర్‌ అసిస్టెంట్‌ వెంకటేశ్వరరెడ్డి, అంగన్‌వాడీ పాల్గొన్నారు. 


బనగానపల్ల్లె: అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఐసీడీఎస్‌ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.21వేలు, పింఛన్‌ రూ.10వేలు చెల్లించాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని, విధి నిర్వహణలో కరోనా సోకి మృతి చెందితే రూ. 50లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. రమాదేవి, మల్లేశ్వరీ, హేమలత, నూర్జహాన్‌ పాల్గొన్నారు. 


కోవెలకుంట్ల: కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని శుక్రవారం రేవనూరు పీహెచ్‌సీ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించి డాక్టర్‌ రాజ శేఖర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు తక్షణమే కరోనా రక్షణ కిట్లు, అదనపు అలవెన్స్‌ రూ. 15 వేలు, కనీస వేతనం రూ. 21 వేలు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించి ఇళ్లస్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు రమణమ్మ, విజయకుమారి, లక్ష్మి పాల్గొన్నారు.


వెల్దుర్తి: అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సమస్యలు పరిష్కరిం చాలని ఏపీ అంగన్‌ వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ అసోసి యేషన్‌ రాష్ట్ర అధ్యక్షురా లు లలిత డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్మికులకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఇన్సూరెన్స్‌ సౌకర్యం, కనీస వేతనం రూ. 20 వేలు చెల్లించాలని, బకాయిలు చెల్లించాలని, కొవిడ్‌తో మృతి చెందితే రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, అంగన్‌వాడీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. సుగునమ్మ, విజయలక్ష్మి, ఈదమ్మ, మాధవస్వామి పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-08T09:50:50+05:30 IST