అంగన్వాడీ సూపర్‌వైజర్ల నోటిఫికేషన్‌ రద్దు?

ABN , First Publish Date - 2022-10-01T10:03:51+05:30 IST

అంగన్వాడీ సూపర్‌ వైజర్‌ పోస్టుల(గ్రేడ్‌-2) నోటిఫికేషన్‌ రద్దు చేసే అవకాశం ఉందని.. ఈ విషయంపై సీఎం జగన్‌ స్వేచ్ఛనిచ్చారని స్త్రీ, శిశు సంక్షేమశాఖా ముఖ్య కార్యదర్శి(పీఎస్‌) ఏఆర్‌ అనురాధ వెల్లడించారు. అయితే.. రద్దు విషయంపై న్యాయ

అంగన్వాడీ సూపర్‌వైజర్ల నోటిఫికేషన్‌ రద్దు?

న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం

స్త్రీ, శిశు సంక్షేమశాఖ పీఎస్‌ వెల్లడి


అమరావతి,సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): అంగన్వాడీ సూపర్‌ వైజర్‌ పోస్టుల(గ్రేడ్‌-2) నోటిఫికేషన్‌ రద్దు చేసే అవకాశం ఉందని.. ఈ విషయంపై సీఎం జగన్‌ స్వేచ్ఛనిచ్చారని స్త్రీ, శిశు సంక్షేమశాఖా ముఖ్య కార్యదర్శి(పీఎస్‌) ఏఆర్‌ అనురాధ వెల్లడించారు. అయితే.. రద్దు విషయంపై న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనిపై నిపుణుల సూచనల మేరకు మొదటి నుంచి ప్రక్రియ మొదలు పెట్టాలా? లేక కోర్టు ఏం చెబుతుందో దానిని అనుసరించాలా అనేది నిర్ణయిస్తామన్నారు. ఈ పోస్టులకు సంబంధించి స్పోకెన్‌ ఇంగ్లీషు పరీక్షను పారదర్శకంగానే నిర్వహించినట్టు చెప్పారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలోనే రాతపరీక్ష ఫలితాలు వెల్లడించలేదన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 560 అంగన్వాడీ సూపర్‌ వైజర్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసి, ప్రక్రియను పారదర్శకంగా చేపట్టామన్నారు. అభ్యర్థులకు ఇంగ్లీషు నైపుణ్యాన్ని పరీక్షించేందుకు ఇంటర్వూలు నిర్వహిస్తే వారు ఇబ్బందిపడతారనే ఉద్దేశంతో స్పోకెన్‌ ఇంగ్లీష్‌ వీడియోను రికార్డు చేసి అప్‌లోడ్‌ చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నామన్నారు. రాతపరీక్షల్లో మంచి మెరిట్‌ సాధించిన అభ్యర్థుల జాబితాను పంపించి సీడీపీవోల ద్వారా స్పోకెన్‌ ఇంగ్లీషు వీడియెలను తెప్పించి మూల్యాంకనం చేశామన్నారు. ఇప్పటికే రాత పరీక్ష మార్కులను వెబ్‌సైట్‌లో ఉంచామని చెప్పారు.  

Updated Date - 2022-10-01T10:03:51+05:30 IST