Viral Video: మాస్క్ ధరించలేదని.. ట్రైన్‌ నుంచి గెంటేశారు

ABN , First Publish Date - 2021-07-19T00:06:18+05:30 IST

కరోనా కల్లలం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు.. తమ ప్రజలకు కీలక సూచనలు ఇస్తున్నాయి. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు భౌతిక దూరం పాటించడంతోపాటు,

Viral Video: మాస్క్ ధరించలేదని.. ట్రైన్‌ నుంచి గెంటేశారు

ఇంటర్నెట్ డెస్క్: కరోనా కల్లలం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు.. తమ ప్రజలకు కీలక సూచనలు ఇస్తున్నాయి. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు భౌతిక దూరం పాటించడంతోపాటు, తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చెబుతున్నాయి. అయినప్పటికీ కొంత మందికి ఈ మాటలు చెవికెక్కడం లేదు. యథేచ్ఛగా కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. వారు ప్రమాదంలో పడటమే కాకుండా చుట్టు పక్కల ఉన్న వారిని కూడా ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేస్తున్నారు. ప్రస్తుతం ఇదంత చెప్పడానికి కారణం ఏంటంటే.. కరోనా నిబంధనలను పాటించని వ్యక్తిపట్ల ప్రజలు వ్యవహరించిన తీరుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. విషయంలోకి వెళితే.. 



స్పెయిన్‌కు చెందిన ఓ యువకుడు మాస్క్ ధరించడకుండానే రైలెక్కేశాడు. అది గమనించిన ప్రయాణికులు మాస్క్ ధరించాల్సిందిగా అతడికి సూచించారు. అయితే అతడు వారి మాటను పట్టించుకోలేదు. దీంతో ప్రయాణికులు ఆగ్రహానికి లోనయ్యారు. ఓ కొంత మంది కలిసి అతడిని ఈడ్చుకొచ్చి.. ట్రైన్ ద్వారం వద్ద నిల్చోబెట్టారు. రైలు స్టేషన్ వద్ద ఆగిన తర్వాత అతడిని ట్రైన్ నుంచి బయటకు గెంటేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. 


Updated Date - 2021-07-19T00:06:18+05:30 IST