
సోంపు గింజలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. అంతేకాదు వీటిలో ఉన్న కాపర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, సెలీనియం, మెగ్నీషియం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. అంతేకాదు వీటిలో ఉన్న కాపర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, సెలీనియం, మెగ్నీషియం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తాయి. ఇంకా వీటిలో ఏయే గుణాలు ఉన్నాయంటే...
రోజూ సమతుల ఆహారం తీసుకుంటూ సోంపు గింజలు తింటే బరువు తగ్గుతారు. సోంపు గింజలలో ఫైబర్ అధికంగా ఉంటుంది.
వీటిలో ఉండే మినరల్స్ హార్మోన్ల సమతుల్యతకు సహాయపడతాయి. ఆక్సిజన్ స్థాయిలు బ్యాలెన్స్‌గా ఉండేందుకు దోహదపడతాయి.
సోంపుగింజలలో యాంటీ కేన్సర్ గుణాలు ఉన్నట్లు అధ్యయనాల్లో వెల్లడయింది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీరాడికల్స్‌ను నాశనం చేస్తాయి.
సోంపు గింజలు నమలడం వల్ల లాలాజలంలో నైట్రేట్ శాతం పెరుగుతుంది. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా వీటిలో ఉండే పోటాషియం హార్ట్‌రేట్‌ను, బీపీని నియంత్రిస్తుంది.
రాత్రివేళ గ్లాసు నీటిలో కొద్దిగా సోంపుగింజలు వేసి ఉదయాన్నే ఆ నీటిని తాగితే జీర్ణసమస్యలు తగ్గుతాయి.
వీటిలో ఉంటే ఫైటో న్యూట్రియెంట్స్ సైనస్ గదులు శుభ్రంగా ఉండేందుకు దోహదపడతాయి. బ్రాంకైటిస్, ముక్కుదిబ్బడ, దగ్గుతో బాధపడే వారు సోంపు గింజలతో చేసిన టీ తాగితే ఉపశమనం దొరుకుతుంది.