నెల్లూరులో ఫ్లెక్సీల వ్యవహారంపై అనిల్ కుమార్ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2022-04-26T18:36:21+05:30 IST

నగరంలో ఫ్లెక్సీల వ్యవహారంపై మాజీ మంత్రి అనిల్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

నెల్లూరులో ఫ్లెక్సీల వ్యవహారంపై అనిల్ కుమార్ కీలక నిర్ణయం

నెల్లూరు: నగరంలో ఫ్లెక్సీల వ్యవహారంపై మాజీ మంత్రి అనిల్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు సిటీలో ఇకపై ఎవరైనా ఫ్లెక్సీలు కట్టుకోవచ్చని అన్నారు. రెండున్నరేళ్లుగా ఫ్లెక్సీరహిత నగరంగా నెల్లూరు సిటీని ఉంచగలిగామని... ఫ్లెక్సీలు కట్టోద్దు అంటే కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలతో పాటు తమ పార్టీ నేతలు కూడా విమర్శలు చేశారన్నారు. ‘‘ఎవరికీ లేని బాధ నా ఒక్కడికే ఎందుకు’’ అని అన్నారు. ఇకపై ఫ్లెక్సీలపై ఎలాంటి నిబంధనా లేదన్నారు. సీఎం నుంచి తనకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అనిల్ కుమార్ తెలిపారు. 

Updated Date - 2022-04-26T18:36:21+05:30 IST