Advertisement

ఫస్ట్‌ మడ్ రేస్ మూవీ ‘మడ్డీ’.. టీజ‌ర్‌ విడుదల

Feb 26 2021 @ 20:49PM

ఇండియన్ ఫస్ట్ మడ్ రేసింగ్ మూవీగా భారీ బడ్జెట్ తో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ మరియు మలయాళం మొత్తం 5 భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ చిత్రం 'మడ్డీ'. ఈ చిత్రంతో డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పీకే7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ కృష్ణదాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  కాగా, ఈ చిత్ర తెలుగు టీజర్‌ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫిబ్రవరి 26న సాయంత్రం 6:03 కి విడుదల చేసి.. ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని.. టీజర్ అద్భుతంగా ఉందంటూ దర్శకుడు ప్రగభల్ కి, టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇతర భాషల్లో అర్జున్ కపూర్, ఫాహద్ ఫాసిల్, జయం రవి మరియు శివ రాజకుమార్‌ టీజర్‌ను రిలీజ్ చేశారు.

 

టీజర్‌ విషయానికి వస్తే.. 'మడ్డీ' టీజర్ రెసీగా ఉంది. రియల్ స్టంట్స్‌తో, ఎంతో రీసెర్చ్‌తో వినూత్నంగా తెరకెక్కిన మడ్డీ టీజర్‌లో చిత్ర బృందం పడిన కష్టం తెలుస్తోంది. ముఖ్యంగా రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, కెజీ రతీష్ సినిమాటోగ్రఫీ చాలా క్రిస్ప్‌గా ఉండి టీజ‌ర్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లాయి. ఈ టీజ‌ర్‌ చూస్తుంటే మడ్డీ  చిత్రం  ప్రేక్షకులను ఒక థ్రిల్లింగ్ రైడ్ కి తీసుకెళ్ళడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ టీజ‌ర్‌ సినిమాపై ఆసక్తిని, అంచనాలను పెంచేదిగా ఉంది. యువన్, రిధాన్ కృష్ణ, అనుషా సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రంలో హరీష్ పెరాడి, ఐ ఎం విజయన్ అండ్‌ రెంజీ పానికర్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.