యంగ్ హీరోతో అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా..?

Jun 8 2021 @ 14:30PM

టాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లు అదుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన నెక్స్ట్ సినిమాను యంగ్ హీరో శర్వానంద్‌తో చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈయన విక్టరీ వెంకటేశ్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌లతో 'ఎఫ్ 3' తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయినట్టు తెలుస్తోంది. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. బ్లాక్ బస్టర్ 'ఎఫ్ 2'కి సీక్వెల్‌గా తయారవుతున్న 'ఎఫ్ 3' మీద భారీగా అంచనాలున్నాయి. కాగా ఈ సినిమాను పూర్తి చేసిన వెంటనే శర్వానంద్‌తో ఓ ప్రాజెక్ట్ మొదలు పెట్టనున్నాడట. అనిల్ రావిపూడితో చేసిన హీరోలందరు మంచి హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం ఓ భారీ హిట్ కోసం వెయుట్ చేస్తున్న శర్వాకి ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే హిట్ పడ్డట్టే అంటున్నారు. వీద్దరి కాంబోకి సంబంధించిన అధికారక ప్రకటన ఎప్పుడు వెలువడనుందో చూడాలి. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.