థర్డ్‌వేవ్‌కు సన్నద్ధమయ్యాం : అనిల్ సింఘాల్

ABN , First Publish Date - 2021-05-08T00:39:18+05:30 IST

గడచిన 24 గంటల్లో 17,188 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి

థర్డ్‌వేవ్‌కు సన్నద్ధమయ్యాం : అనిల్ సింఘాల్

అమరావతి : గడచిన 24 గంటల్లో 17,188 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ ప్రకటించారు. 14,655 మంది కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే కోవిడ్‌తో 73 మంది మరణించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించిందని, ఈ రోజు 470 మెట్రిక్ టన్నులను సరఫరా చేశామని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు 13,150 రెమిడేసివిర్ డోసెస్ ఇచ్చామని, ప్రభుత్వ హాస్పిటల్స్‌లో 22108 డోసెస్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ రోగులకు బెడ్స్ ఖాళీ అవగానే, ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయంలో తాము మార్గదర్శకాలతో కూడిన జీవోను ఇచ్చామని తెలిపారు. ఆక్సిజన్  ప్లాంట్ల కోసం 180 కోట్లు కేటాయించామని, వీటి ఏర్పాటుకై పరిపాలనా  పరమైన అనుమతులను కూడా ఇచ్చామని వెల్లడించారు. త్వరలో ధర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్న నేపథ్యంలో దానికి కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధతతో ఉన్నామని  అనిల్ సింఘాల్ స్పష్టం చేశారు. 


Updated Date - 2021-05-08T00:39:18+05:30 IST